- Telugu News Photo Gallery Cinema photos Actress Pooja Hegde completes her portions in Hero Suriya 44 Movie
Pooja Hegde: ఎట్టకేలకు పూజా పాప షూటింగ్ కంప్లీట్ చేసింది.. ఆ స్టార్ హీరో సినిమాలో బుట్టబొమ్మ
2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన పూజా ఫొటోలు చూసి దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘ముఖమూడి’ సినిమాతో పూజా తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది. అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా తమిళ సినిమా నుంచి తప్పుకుంది.
Updated on: Sep 26, 2024 | 9:03 PM

2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన పూజా ఫొటోలు చూసి దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘ముఖమూడి’ సినిమాతో పూజా తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది. అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా తమిళ సినిమా నుంచి తప్పుకుంది.

2014 తెలుగు సినిమా 'ఒక లైలా కోసం'లో అక్కినేనితో నాగ చైతన్య తో జతకట్టింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన ‘మొహెంజ దారో’ అనే హిందీ చిత్రంలో నటించింది. మిగతా భాషల్లో పెద్దగా నటించకపోయినా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

మాస్క్ సినిమా తర్వాత తమిళ సినీ అభిమానుల్లో కనిపించకుండా పోయిన పూజ 2022లో విడుదలైన ‘బీస్ట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. దళపతి విజయ్ సరసన నటించి తమిళ అభిమానుల దృష్టిని మరోసారి ఆకర్షించింది పూజా హెగ్డే.

రణవీర్ సింగ్ సరసన సర్కస్, ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సల్మాన్ ఖాన్ సరసన కిజీ కా భాయ్ కిజీ కి జాన్ వంటి హిట్ చిత్రాలలో నటించిన పూజా రీసెంట్ గా చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అయ్యింది. తాజాగా పూజా సూర్య 44తో కోలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా పూజా తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసింది.