చెన్నై పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఏముందోనని ఓపెన్ చేసి చూడగా..!

దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవు లను కస్టమ్స్ అధికారులు జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను అణువణువు చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున చెన్నై పోర్టు లో కస్టమ్స్ అధికారులు ఓ అనుమానాస్పద బ్యాగేజీని స్వాధీనం చేసుకున్నారు..

చెన్నై పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఏముందోనని ఓపెన్ చేసి చూడగా..!
Drug Seized At Chennai Port
Follow us

|

Updated on: Sep 27, 2024 | 8:11 AM

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవు లను కస్టమ్స్ అధికారులు జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను అణువణువు చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున చెన్నై పోర్టు లో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు.

చెన్నై పోర్టులో భారీ డ్రగ్స్‌ కంటైనర్‌ గుర్తించారు అధికారులు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న రూ.110 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను అధికారుల కళ్లు గప్పి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా, అధికారులు వారిని గుర్తించారు. అయితే, చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గురువారం చెన్నై ఓడరేవులో ఎగుమతి సరుకుల నుండి 112 కిలోల సూడోపెడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది మరియు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..