వేలానికి డబుల్‌ స్టోర్‌ బిల్డింగ్‌..! ధర కేవలం రూ.100-1000 మధ్యలోనే.. కారణం ఏంటంటే..

ఇక్కడి నుంచి చూస్తే.. చుట్టూ లోయలు, పచ్చని ప్రకృతి మధ్య అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఇది కాకుండా, సమీపంలో అనేక దుకాణాలు, ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బస్సులు, రైళ్లు సహా ప్రజా రవాణా మార్గాలు కూడా ఇక్కడికి అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ ఇల్లు ఎక్కడుందో చెప్పలేదు కదా..?

వేలానికి డబుల్‌ స్టోర్‌ బిల్డింగ్‌..! ధర కేవలం రూ.100-1000 మధ్యలోనే.. కారణం ఏంటంటే..
New Tredegar
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 27, 2024 | 10:50 AM

ప్రపంచంలో ఎక్కడున్నా సామాన్యుడికి ఇల్లు కొనడం అనేది అతని చిరకాల స్వప్నం. కానీ, ఇప్పుడు పరిస్థితులు సామాన్యుడి సొంతింటి కలను ఆకాశమంతా ఎత్తుకు లేపేసింది. భూమి ధరలు చుక్కలన్నంటుతున్నాయి. కానీ, ఇప్పుడు ఓ ఇంటిని అతి తక్కువ ధరకు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. రెండంతస్తుల భవనాన్ని కేవలం రూ.100 నుంచి రూ.1000 ల మధ్యలోనే అమ్మకానికి పెట్టారు. దీంతో విషయం ఆ నోట ఈ నోట పడింది.. చివరకు ఇంటర్‌నెట్‌లో చేరింది. సోషల్ మీడియాలో వీడియా ప్లాట్‌ఫామ్‌పై వార్త మరింత వైరల్‌గా మారింది. ఇంతకీ అంత తక్కువ ధరకు విక్రయిస్తున్న ఆ ఇల్లు ఎక్కడిది..? ఎందుకు అంత తక్కువ ధరకు ఆ ఇంటిని విక్రయిస్తున్నారు..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం…

వేల్స్‌లోని న్యూ ట్రెడెగర్‌లో ఉన్న ఓ ఇంటి ప్రారంభ బిడ్ సున్నా పౌండ్ల వద్ద మొదలుపెడుతున్నారు. అంటే, ఆస్తిని సాంకేతికంగా రూ. 100 లేదా రూ. 1,000కి కొనుగోలు చేయవచ్చు. పాల్ ఫోష్ ఈ ఇంటిని వేలం వేస్తున్నారు. ఈ ఇల్లు ఒక అందమైన గ్రామంలో ఉంది. ఇది రెండంతస్తుల ఎత్తైన భవనం..ఇక్కడి నుంచి చూస్తే.. చుట్టూ లోయలు, పచ్చని ప్రకృతి మధ్య అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఇది కాకుండా, సమీపంలో అనేక దుకాణాలు, ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బస్సులు, రైళ్లు సహా ప్రజా రవాణా మార్గాలు కూడా ఇక్కడికి అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ ఇల్లు ఎక్కడుందో చెప్పలేదు కదా..? ఇది బన్నౌ బ్రైచెనియోగ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది.

సకల సదుపాయాలు కలిగిన ఈ ఇంటిని ఎందుకు అంత తక్కువ ధరకు విక్రయిస్తున్నారే సందేహం మీకూ వచ్చే ఉంటుంది కదా..? అయితే, ఈ ఇంటిని వేలం వేస్తున్నారు. ఈ ఇంట్లో గతంలో పెద్ద మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఇల్లు దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా దాని ఇంటీరియర్ పూర్తిగా కాలిబూడిదైపోయింది. ఇలాంటి ఇంటిని ఎవరు కొనుగోలు చేసినా దానిని మరమ్మతుల కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే దాని ధర అంత తక్కువగా ఉందని బిడ్‌ నిర్వాహకులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

సమాచారం మేరకు ప్రకారం, ఈ ఇల్లు కింద, మేడపై ఒక్కొక్కటి మూడు బెడ్‌రూమ్‌లతో ఉంటుంది. పైగా ఈ ఇంటికి అందమైన తోట కూడా ఉంది. అక్టోబర్ 1న వేలం ముగుస్తుంది. మరి ఈ ఇల్లు ఎంత ధరకు అమ్ముడవుతుందో చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?