Viral: షోరూం వ్యక్తితో కార్ టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లారు.. కట్ చేస్తే..

బాబోయ్.. ఏంట్రా ఇలా తయారయ్యారు. కారు కొనేవాళ్లలా పెద్ద ఫోజు కొడుతూ షోరూంకి వచ్చారు. అన్ని చెక్ చేసి ఎస్‌యూవీ వాహనం తమకు నచ్చిందన్నారు. ఓ సారి టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లొస్తామన్నారు. కట్ చేస్తే...

Viral: షోరూం వ్యక్తితో కార్ టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లారు.. కట్ చేస్తే..
Car Test Drive
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 27, 2024 | 11:26 AM

కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ ముఖ్యమే. పికప్ ఎలా ఉంది..? వాహనంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలిసిపోతుంది. అయితే ఈ రోజుల్లో టెస్ట్ డ్రైవ్ పేరుతో కారుతో పరారయ్యే కేటుగాళ్లు కూడా పెరిగిపోయారు. తాజాగా అలాంటి కేసే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం (సెప్టెంబర్ 26) వెలుగుచూసింది. ఇద్దరు యువకులు టెస్ట్ డ్రైవ్ చేస్తామని అడిగి కారుతో పరారయ్యారు. ఎంతసేపటికీ రాకపోవడంతో కారు షోరూం వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గ్రేటర్ నోయిడాలోని సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్‌ను ఇద్దరు వ్యక్తులు గురువారం సందర్శించారు. షోరూం మొత్తం తనిఖీ చేసి..  అక్కడ ఉన్న ఎస్‌యూవీ నచ్చిందని.. కొనుగోలు చేస్తానని చెప్పారు. అయితే కార్ టెస్ట్ డ్రైవ్ చేస్తామని.. వారు కోరారు. దీంతో తన సిబ్బందిలో ఒకరితో కలిసి వారు.. కార్‌ని తీసుకుని టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లారు.  అయితే  కొంత దూరం వెళ్లిన తర్వాత షోరూం ఉద్యోగిని కారులో నుంచి కిందకు తోసి.. ఆ ఇద్దరు కారుతో పరారయ్యారు. కారును తీసుకెళ్లిన దృశ్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కారును బయటికి తీసుకెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న నాలెడ్జ్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే కారు యజమానికి, కొనుగోలుదారుకు మధ్య ఏమైనా వివాదం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారును తీసుకెళ్లిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదేని షోరూం యజమాని చెప్పడంతో దుండగుల గుర్తింపును గుర్తించడం సవాలుగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?