AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: అసలేంటీ డిజిటల్ అరెస్ట్‌.. కేటుగాళ్ల కొత్త రూటు ఏంటి.?

రోజులు మారుతున్నాయి. మారిన కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రకరాల కొంగొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్‌ పేరుతో జరుగుతోన్న ఈ మోసాల్లో ప్రజల పెద్ద ఎత్తున మోసపోతున్నారు...

Cyber Crime: అసలేంటీ డిజిటల్ అరెస్ట్‌.. కేటుగాళ్ల కొత్త రూటు ఏంటి.?
Cyber Crime
Narender Vaitla
|

Updated on: Sep 27, 2024 | 12:16 PM

Share

రోజులు మారుతున్నాయి. మారిన కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రకరాల కొంగొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్‌ పేరుతో జరుగుతోన్న ఈ మోసాల్లో ప్రజల పెద్ద ఎత్తున మోసపోతున్నారు. భయంతో వెనకా ముందు ఆలోచించకుండా డబ్బులు ముట్టజెపుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త రకం మోసం ఎలా జరుగుతుంది.? ప్రజలు ఎలా మోసాల బారిన పడుతున్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫెడెక్స్‌ లేదా మరో కొరియర్‌ కంపెనీ పేరుతో కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్‌ చేయగానే మీ పేరుతో ఒక పార్శిల్ వచ్చిందని చెబుతారు. అందులో నిషేధిత డ్రగ్స్‌ ఉన్నాయని భయపెడుతారు. ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో స్కైట్‌ లేదా వాట్సాప్‌ వీడియోకాల్స్‌ చేస్తుంటారు. మిమ్మల్ని నిందితులుగా చేర్చి విచారిస్తున్నట్లు చెబుతారు.

అనంతరం ఆన్‌లైన్‌ ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నామని గంటలతరబడి వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా డిజిటల్ అరెస్ట్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని ఇంటి నుంచి వదిలి ఎక్కడికి వెళ్లొద్దంటూ చెప్తారు. ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని భయపెట్టి రూ. లక్షల్లో కాజేస్తున్నారు.

ఇలాంటి కేసులు ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్నాటకలో ఎక్కువగా నమోదువుతున్నాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, మెట్రో సిటీలను సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరగాళ్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. డార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్లలో కొనుగోలు చేసిన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏజెన్సీల ద్వారా సేకరించిన బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్ల వివరాలతో మోసాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

అసలు ఇప్పటి వరకు డిజిట్‌ అరెస్ట్ అనేదే లేదని చెబుతున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి కాల్స్‌ చేసి బెదిరిస్తే భయపడకుండా స్థానికంగా ఉన్న పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూడదని అర్థం చేసుకోవాలి. అలాగే పోలీసులు ఎవరూ డబ్బులు అడగరానే లాజిక్‌ను గుర్తు పెట్టుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..