- Telugu News Photo Gallery Technology photos Amazon great indian sale 2024 Some of the Best deals on smartphones
Amazon: ఆఫర్ల పండగ మొదలైంది.. కొత్త ఫోన్ కొనే వారికి ఇదిగో బెస్ట్ ఆప్షన్స్..
Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ మొదలైంది. వినియోగదారులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రారంభమైన సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Sep 27, 2024 | 1:11 PM

అమెజాన్ సేల్‌లో లభిస్తున్న బెస్ట్ డీల్స్‌లో యాపిల్ ఐఫోన్ 13 ఒకటి. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. యాపిల్ ఐఫోన్ అసలు ధర రూ. 59,600గా ఉండగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 39,999కి లభిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఇచ్చారు.

iQoo Z9x 5G: అమెజాన్ సేల్‌లో లభిస్తున్న మరో బెస్ట్ డీల్ ఐక్యూ జెడ్9 ఎక్స్ ఒకటి. ఈ 5జీ ఫోన్ అసలు ధర రూ. 18,999కాగా సేల్‌లో భాగంగా రూ. 13,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.

OnePlus 12R 5G: అమెజాన్ సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్ డీల్స్‌లో వన్‌ప్లస్ 12ఆర్ ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ. 42,999కాగా సేల్‌లో భాగంగా రూ. 37,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 100 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Samsung Galaxy M35 5G: అమెజాన్ సేల్‌లో లభిస్తున్న మరో బెస్ట్ డీల్ సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్35 ఒకటి ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 24,999కాగా సేల్ భాగంగా రూ. 14,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Samsung Galaxy S23 Ultra 5G: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 అల్ట్రాపై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 74,999కే సొంతం చేసుకోవచ్చు. గరూ. 3750 కూపన్ అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో బాగంగారూ. 65 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.




