AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaming addiction: ఆన్‌లైన్‌ గేమ్స్‌లో రూ. 96 లక్షలు స్వాహా.. యావత్ దేశం దిగ్భ్రాంతి..

జార్ఖండ్‌కు చెందిన హిమాన్షు మిశ్రా అనే ఓ 22 ఏళ్ల వయువకుడు గేమింగ్ వ్యసనానికి అలవాటు పడ్డాడు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతూ సుమారు కోటి రూపాయాలు నష్టపోయాడు. తాజాగా యూట్యూబర్ షాలినీ కపూర్ తివారీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో హిమాన్షు మిశ్రా పలు విషయాలను పంచుకున్నాడు. ఈ వీడియోలో హిమాన్షు తీవ్రంగా కంటతడి...

Gaming addiction: ఆన్‌లైన్‌ గేమ్స్‌లో రూ. 96 లక్షలు స్వాహా.. యావత్ దేశం దిగ్భ్రాంతి..
Online Games
Narender Vaitla
|

Updated on: Sep 27, 2024 | 11:15 AM

Share

రోజురోజుకీ ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఉన్నత చదువులు చదివినవారు కూడా మోసాల బారిన పడి డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనకు యావత్‌ దేశమే ఉలిక్కి పడింది. ఓ 22 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌లో ఏకంగా రూ. 96 లక్షలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జార్ఖండ్‌కు చెందిన హిమాన్షు మిశ్రా అనే ఓ 22 ఏళ్ల వయువకుడు గేమింగ్ వ్యసనానికి అలవాటు పడ్డాడు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతూ సుమారు కోటి రూపాయాలు నష్టపోయాడు. తాజాగా యూట్యూబర్ షాలినీ కపూర్ తివారీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో హిమాన్షు మిశ్రా పలు విషయాలను పంచుకున్నాడు. ఈ వీడియోలో హిమాన్షు తీవ్రంగా కంటతడి పెట్టుకోవడం అందరినీ ఆలోజింప చేస్తోంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాలనుకునే వారికి ఇదొక గుణపాఠంగా చెప్పొచ్చు.

ఇక హిమాన్షు మిశ్రా విషయానికొస్తే అతనేదో సాదాసీదా విద్యార్థి కాదు. ఐఐటీ జేఈఈ లో ఏకంగా 98 శాతం మార్కులు సాధించాడు. అయితే అయితే ఆన్‌లైన్‌ గేమ్స్‌ అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. డ్రీమ్-11, మహాదేవ్ యాప్ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌లో రూ. లక్షల రూపాయలు కోల్పోయినట్లు తెలిపాడు. మొదట ఏదో సరాదగా మొదలైన ఈ ఆట ఆ తర్వాత ఆయనకు ఒక వ్యవసనంలా మారింది. మొదట కేవలం రూ. 49తో మొదలు పెట్టి క్రమంగా బెట్టింగ్‌ను పెంచుకుంటూ పోయాడు.

తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కోసం ఇచ్చిన డబ్బును కూడా గేమ్స్‌లో పెట్టడం ప్రారంభించాడు. అక్కడితో ఆగకుండా స్నేహితులు, బంధువులు ఇలా ఎవరు దొరికితే వారి దగ్గర అప్పులు చేశాడు. ఇప్పుడు హిమాన్షు తాను ఒంటరి వాడినయ్యానని చెప్పుకొచ్చాడు. హిమాన్షు ఆన్‌లైన్‌ గేమ్‌ వ్యసనం అతన్ని కుటుంబాన్ని కూడా ఆర్థికంగా నాశనం చేసింది. కొంతమేర అప్పులు తీర్చిన తర్వాత పేరెంట్స్‌ హిమాన్షును ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అందుకే ఆన్‌లైన్‌ గేమ్స్‌ జోలికి అస్సలు వెళ్లకూడదని పోలీసులు చెబుతూనే ఉన్నారు.

హిమాన్షు జీవితంలో జరిగిన సంఘటన నుంచి ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో గేమ్స్‌ అనేవి 100 శాతం ఫేక్‌. ఎవరో ఎక్కడో ఉండి మీ డబ్బులతో ఆడుతున్నారంటేనే అందులో ఉన్న మోసం గురించి అర్థం చేసుకోవాలి. అలా కానీ తొందరపడి ముందుకు వెళ్తే చివరికి ఏం మిగలదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అప్పుల పాలై చివరికి ఆత్మహత్య చేసుకున్న ఉదాంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే అత్యాశకు పోకుండా జీవితాన్ని సంతోషంగా గడపాలని సూచిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..