AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌ మెటాలో మూడు కొత్త ఏఐ ఫీచర్లు.. వాటి ఉపయోగం ఏంటో తెలుసా.?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మెటా దూసుకుపోతోంది. ఇప్పటికే తమ అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మెటా ఏఐ పేరుతో సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మెటా ఏఐ మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది...

WhatsApp: వాట్సాప్‌ మెటాలో మూడు కొత్త ఏఐ ఫీచర్లు.. వాటి ఉపయోగం ఏంటో తెలుసా.?
Whatsapp Ai
Narender Vaitla
|

Updated on: Sep 27, 2024 | 9:25 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మెటా దూసుకుపోతోంది. ఇప్పటికే తమ అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మెటా ఏఐ పేరుతో సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మెటా ఏఐ మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ మెటా తీసుకొచ్చిన ఆ మూడు కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా మనకు ఏదైనా సందేహం ఉంటే మెటా ఏఐ చాట్‌ను ఓపెన్ చేసి టెక్ట్స్‌ టైప్‌ చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ సహాయంతో ఫొటోతో కూడా సమాధానం పొందొచ్చు ఉదాహరణకు మీకు తెలియని భాషలో ఏదైనా ఫొటో లేదా బోర్డు ఉందని అనుకుందాం. ఆ ఫొటోను పంపించి దాని అర్థం ఏంటని అడగితే వెంటనే మీకు కావాల్సిన సమాధానం వస్తుంది.

* ఫొటోలను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది మెటా. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ఫొటోలను మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైన ఫొటో పంపి అందులోని రంగులను మార్చాలని కమాండ్ ఇస్తే చాలు వెంటనే మార్చేస్తుంది. అంతేకాకుండా బ్యాగ్రౌండ్‌లో ఉన్న వస్తువులను తొలగించాలన్నా ఇట్టే తొలగించేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌లో ఉండగా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌తో ఇకపై ఫొటో ఎడిటింగ్ కోసం ఇతర ప్లాట్‌ ఫామ్స్‌ను ఉపయోగించాల్సి అవసరం ఉండదు.

* మెటాతో రియల్ టైమ్‌లో సంభాషణలు జరిగేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఏవైనా ప్రశ్నలు అడగ్గాన్నే సంబంధిత విషయం గురించి స్పష్టంగా వివరిస్తుంది. దీంతో మీరు నేరుగా ప్రశ్నలు అడగొచ్చు. అంతేకాదు ఏఐ మీతో జోకులను కూడా పంచుకుటుంది. అత్యంత వేగంగా సమాధానాలు ఇస్తుంది. మెటా ఏఐ వాయిస్‌ని కూడా మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. కొందరు ప్రముఖుల వాయిస్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?