AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme p2 pro 5G: రియల్ మీ నుంచి అదిరిపోయే 5 జీ ఫోన్..విక్రయాలు షురూ..!

రియల్ మీ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ ఫీచర్లతో ఈ బ్రాండ్ నుంచి ఫోన్లు విడుదలతూ ఉంటాయి. కెమెరా నాణ్యత, బ్యాటరీ సామర్థ్యానికి ఈ ఫోన్లలో ప్రాధాన్యత ఇస్తారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఉండడంతో పాటు చార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుంది. దీంతో రియల్ మీ బ్రాండ్ ఫోన్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.

Realme p2 pro 5G: రియల్ మీ నుంచి అదిరిపోయే 5 జీ ఫోన్..విక్రయాలు షురూ..!
Realme P2 Pro 5g
Nikhil
|

Updated on: Sep 26, 2024 | 4:30 PM

Share

రియల్ మీ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ ఫీచర్లతో ఈ బ్రాండ్ నుంచి ఫోన్లు విడుదలతూ ఉంటాయి. కెమెరా నాణ్యత, బ్యాటరీ సామర్థ్యానికి ఈ ఫోన్లలో ప్రాధాన్యత ఇస్తారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఉండడంతో పాటు చార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుంది. దీంతో రియల్ మీ బ్రాండ్ ఫోన్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ తన యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. తన పి సిరీస్ నుంచి కొత్త రియల్ మీ పీ2 ప్రో 5జీ ఫోన్ ను సెప్టెంబర్ 13న ఆవిష్కరించింది. దీనిలో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ విక్రయాలు ఆన్ లైన్ లో ప్రారంభమయ్యాయి.

రియల్‌మీ పీ2 ప్రో ప్రత్యేకతలు ఇవే

  • రియల్ మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ప్యారట్ గ్రీన్, ఈగిల్ గ్రే అనే రెండు రకాల కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.
  • ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్, 4 ఎన్ఎం ప్రాసెస్, 2.4 జీహెచ్ జెడ్ సీపీయూ, ఆండ్రెనో 710 జీపీయూ తదితర వాటిని ఏర్పాటు చేశారు.
  • 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో తీసుకువచ్చారు. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.
  • కొత్త రియల్ మీ ఫోన్ లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. మంచి పిక్సెల్, ఎఫ్ హెచ్ డీ+ రిజల్యూషన్, 120 హెచ్ జెడ్ వరకూ రిఫ్రెష్ రేటు కారణంగా విలువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
  • దీనిలోని బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చార్జింగ్ అయిపోతుందని యూజర్ల ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. 80 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జర్ కు మద్దతు ఇస్తుంది. రోజంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే చార్జింగ్ చేసుకోవడం కూడా చాలా సులభం.
  • కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 ఓఐఎస్, 8 ఎంపీ అల్ట్రావైడ్, 32 ఎంపీ సోనీ సెల్పీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో ఎలాంటి సందర్భంలోనైనా చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. పండగలు, శుభకార్యాలు, కుటుంబ సభ్యులు కలిసినప్పుడు, ఇతర ముఖ్యమైన సమయాలలో ఫొటోలు తీసుకుని, మెమరీస్ భద్రపర్చుకోవచ్చు.

ఫోన్ ధర ఇదే

  • రియల్ మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మూడు రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
  • 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తున్న వేరియంట్ రూ.21,999కు లభిస్తుంది.
  • 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.24,999గా నిర్ణయించారు.
  • 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ను రూ.27,999కు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అదనపు తగ్గింపులు

కొత్త రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన సమయంలో వినియోగదారులకు వివిధ డిస్కౌంట్లు అందజేస్తున్నారు. ముఖ్యంగా అన్ని రకాల వేరియంట్లపై రూ.2 వేలు ప్రారంభ తగ్గింపు ఉంటుంది. వీటితో పాటు వెయ్యి రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను అమలవుతోంది. అంటే మిడ్ వేరియంట్ ను రూ.21,999కు, టాప్ వేరియంట్ ను రూ.24,999కు కొనుగోలు చేసుకునే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ