Mobile: పొరపాటున మొబైల్‌లో ఈ పని చేయకండి.. యమ డేంజర్.. జైలు శిక్ష తప్పదు!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్ ఉంది. మారుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్‌ ఉండలేనివారు ఎందరో ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్‌ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారు. డిపాజిట్‌ టెక్నాలజీ వచ్చిన తర్వాత బ్యాంకు పనుల నుంచి వివిధ రకాల దరఖాస్తులు.. ఇలా ఒక్కటేమిటి చాలా రకాల పనులు స్మార్ట్‌ ఫోన్‌లో చేసుకునే రోజులు..

Mobile: పొరపాటున మొబైల్‌లో ఈ పని చేయకండి.. యమ డేంజర్.. జైలు శిక్ష తప్పదు!
Follow us

|

Updated on: Sep 25, 2024 | 6:21 PM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్ ఉంది. మారుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్‌ ఉండలేనివారు ఎందరో ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్‌ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారు. డిపాజిట్‌ టెక్నాలజీ వచ్చిన తర్వాత బ్యాంకు పనుల నుంచి వివిధ రకాల దరఖాస్తులు.. ఇలా ఒక్కటేమిటి చాలా రకాల పనులు స్మార్ట్‌ ఫోన్‌లో చేసుకునే రోజులు వచ్చేశాయి. అలాగే ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే స్మార్ట్‌ ఫోన్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. వ్యక్తులు ఫోన్ ద్వారా ఏదైనా మంచి లేదా చెడు పని చేయవచ్చు. ఫోన్‌లో దేనిగురించి అయినా సెర్చ్‌ చేస్తే క్షణాల్లో కళ్ల ముందుంటుంది. అయితే మంచి పనికి వాడడమే కాకుండా చెడు పనులకు కూడా వాడుతున్నవారు చాలా మందే ఉన్నారు.

ఇది కూడా చదవండి: Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు పెద్ద అప్‌డేట్.. కొత్త సర్వీస్‌ ఈ రాత్రి నుంచే ప్రారంభం!

ఈ కారణంగా, మొబైల్ ఫోన్ మంచి, చెడు ప్రభావాలను కలిగి ఉంటుంది. అయితే, మొబైల్ వినియోగదారులుగా చట్ట పరిధిలో ఉంటూనే మన మొబైల్ ఫోన్‌లతో మనం ఏమి చేయగలమో, ఏం చేయలేమో గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఫోన్‌లో ఇలాంటి పనులు చేయకూడదా?

సాంకేతికత అభివృద్ధి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దీనికి అనేక ప్రతికూలతలు కూడా ఉన్నాయి. హ్యాకింగ్, బ్యాంకు ఖాతాల్లో మోసం, పిల్లలకు అశ్లీలత వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కొంతమంది వినియోగదారులు ఫోన్ ద్వారా అనేక తప్పుడు కార్యకలాపాలు చేస్తూ వారి గురించి ఎవరికీ ఏమీ తెలియదని భావిస్తారు. మీరు మీ ఫోన్‌లో ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేస్తే, మీరు చట్టం నుండి తప్పించుకోలేరని గుర్తించుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు జైలుకు కూడా వెళ్లవచ్చు. మీరు ఫోన్‌లో ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

ఈ విషయాలను నివారించడం ముఖ్యం:

చైల్డ్ పోర్నోగ్రఫీ: ఇది నేరమని, దానికి 3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పిల్లల అశ్లీల చిత్రాలను చూడటం పోక్సో చట్టం ప్రకారం తీవ్రమైన నేరం.

బాంబును తయారు చేసే మార్గాన్ని సెర్చ్‌ చేయడం: మీరు గూగుల్‌లో బాంబును తయారు చేసే మార్గాన్ని సరదాగా వెతికితే, అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గూగుల్‌ అటువంటి సెర్ఛ్ కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తుంది. మీ సమాచారాన్ని భద్రతా ఏజెన్సీలతో పంచుకోవచ్చు.

పైరసీ: సినిమా పైరసీ ఖచ్చితంగా చట్టబద్ధం. పైరసీ సినిమాలను డౌన్‌లోడ్ చేయడం చట్టవిరుద్ధం, అలాగే లక్షల రూపాయల జరిమానా విధిస్తారు.

అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడం: ఇది గోప్యత ఉల్లంఘన మాత్రమే కాదు, నేరం కూడా. ఇది జైలుకు వెళ్లే అవకాశంతో సహా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. అందుకే ఫోన్‌లో ఇలాంటి పొరపాట్లు చేస్తే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ATM Cash Deposit Limit: ఏటీఎంల నుంచి క్యాష్‌ డిపాజిట్‌ పరిమితి నిబంధనలు మార్పు.. రోజుకు ఎంతంటే..

మరిన్ని టెక్నాలజీ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి