AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు పెద్ద అప్‌డేట్.. కొత్త సర్వీస్‌ ఈ రాత్రి నుంచే ప్రారంభం!

Airtel New Service: ఈ రోజుల్లో చాలా మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత చాలా పనులు సులభతరం చేశాయి. కానీ స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తర్వాత అనేక సమస్యలు కూడా సృష్టించాయి. చాలా మందికి ఒక సాధారణ సమస్య స్పామ్ కాల్స్. కొన్నిసార్లు క్రెడిట్ కార్డులు, కొన్నిసార్లు వ్యక్తిగత రుణాలు, మరేదైనా విక్రయించడానికి ఫోన్‌కు కాల్‌లు వస్తాయి...

Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు పెద్ద అప్‌డేట్.. కొత్త సర్వీస్‌ ఈ రాత్రి నుంచే ప్రారంభం!
Subhash Goud
|

Updated on: Sep 25, 2024 | 5:22 PM

Share

Airtel New Service: ఈ రోజుల్లో చాలా మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత చాలా పనులు సులభతరం చేశాయి. కానీ స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తర్వాత అనేక సమస్యలు కూడా సృష్టించాయి. చాలా మందికి ఒక సాధారణ సమస్య స్పామ్ కాల్స్. కొన్నిసార్లు క్రెడిట్ కార్డులు, కొన్నిసార్లు వ్యక్తిగత రుణాలు, మరేదైనా విక్రయించడానికి ఫోన్‌కు కాల్‌లు వస్తాయి. పని మధ్యలో ఈ ఫోన్ కాల్స్ ఇబ్బంది పెట్టినప్పుడు, ఒక వ్యక్తి చిరాకు పడతాడు. టెలికమ్యూనికేషన్ భాషలో ఇటువంటి కాల్‌లను స్పామ్ కాల్స్ అంటారు. ఇటువంటి స్పామ్ కాల్స్‌ వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నాయి. అంతేకాదు.. ఎన్నో మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి స్పామ్‌ కాల్స్‌ చేస్తూ సెకన్లలోనే అకౌంట్లో ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు.

అయితే మీరు ఎయిర్‌టెల్ యూజర్ అయితే, ఈ విషయంలో మీకు పెద్ద అప్‌డేట్ ఉంది. ఎయిర్‌టెల్ స్పామ్ కాల్‌ల కోసం కొత్త సొల్యూషన్‌తో ముందుకు వచ్చింది. ఈ AI-ఆధారిత పరిష్కారం మీకు స్పామ్ కాల్‌లను గుర్తించడాన్ని చాలా సులభం చేస్తుంది. మీడియా సమావేశంలో ఈ సర్వీస్‌ ఈ రోజు రాత్రి నుండి ప్రారంభించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సర్వీస్ రిక్వెస్ట్ లేదా అదనపు డౌన్‌లోడ్‌లు అవసరం లేకుండా ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ సిస్టమ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేయబడుతుందని కంపెనీ ప్రకటించింది.

Airtel AI ఆధారిత స్పామ్ కాల్స్ సొల్యూషన్:

ఇవి కూడా చదవండి

నేటి కాలంలో దాదాపు 87% మంది వ్యక్తులు స్పామ్ సందేశాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం స్పామ్ కాల్‌లను ఎదుర్కోవడానికి స్పామ్ ఫిల్టర్, క్రౌడ్ సోర్స్ బేస్డ్ యాప్, CNAP వంటి సిస్టమ్‌లు ఉన్నాయి. కానీ అవి పూర్తి పరిష్కారాన్ని అందించలేకపోతున్నాయి. అటువంటి పరిస్థితిలో సుమారు 10 వేల మంది సహాయంతో ఎయిర్‌టెల్ ఒక సంవత్సరం కష్టపడి ఒక ముగింపునకు చేరుకుంది. ఎయిర్‌టెల్ AI ఆధారిత స్పామ్ కాల్స్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. ఈ రాత్రి నుంచి ఈ సదుపాయం ప్రారంభం కానుంది.

ఈ AI ఆధారిత సొల్యూషన్ రియల్ టైమ్ అలర్ట్ ఇస్తుంది. ప్రతి తెలియని కాల్ అనుమానిత స్పామ్‌గా కనిపిస్తుంది. దీన్ని ప్రస్తుతం బ్లాక్ చేయడం లేదు. కానీ భవిష్యత్తులో బ్లాక్ చేస్తాము. ఈ సదుపాయాన్ని పొందేందుకు, ఎయిర్‌టెల్ వినియోగదారులు ఏ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనవసరం లేదు. అలాగే వారు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. Swiggy, Zomato మొదలైన సర్వీస్ కాల్‌లకు సంబంధించి అన్ని టెలికాం ఆపరేటర్‌లతో చర్చలు జరుగుతున్నాయి. తద్వారా వాటిని స్పామ్ నుండి వేరుగా ఉంచవచ్చు.. అలాగే వారి గుర్తింపు సులభం అవుతుంది అని తెలిపింది. ప్రస్తుతం ఈ సదుపాయం స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులోకి రానుంది. ఫీచర్ ఫోన్‌ల కోసం ఇది అప్‌గ్రేడ్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: ATM Cash Deposit Limit: ఏటీఎంల నుంచి క్యాష్‌ డిపాజిట్‌ పరిమితి నిబంధనలు మార్పు.. రోజుకు ఎంతంటే..

మరిన్ని టెక్నాలజీ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి