- Telugu News Photo Gallery Technology photos Refrigerator Cleaning Tips home kitchen tips dirt removed from fridge
Refrigerator Cleaning Tips: రిఫ్రిజిరేటర్ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే ఫ్రిజ్ మెరిసిపోతుంది!
Refrigerator Cleaning Tips: ఇల్లు అందంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు సంవత్సరాల తరబడి శుభ్రం చేయక పోవడం వల్ల మీ ఇంటి రూపురేఖలు మొత్తం పాడవుతాయి..
Updated on: Sep 24, 2024 | 5:10 PM

Refrigerator Cleaning Tips: ఇల్లు అందంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు సంవత్సరాల తరబడి శుభ్రం చేయక పోవడం వల్ల మీ ఇంటి రూపురేఖలు మొత్తం పాడవుతాయి. అలాంటి పరిస్థితుల్లో మీ ఇంటి వంటగదిలో ఉంచిన రిఫ్రిజిరేటర్ జిడ్డుగా కనిపించడం ప్రారంభించినట్లయితే, ఈ చిట్కాలన్నింటినీ పాటించడం ద్వారా మీ ఫ్రిజ్‌ను మెరిసేలా చేయవచ్చు. ఈ చిట్కాలు ఫ్రిజ్‌ను వేగంగా శుభ్రం చేయడంలో మీకు సహాయపడతాయి.

ఫ్రిజ్‌ని తక్షణమే మెరిసేలా చేయండి : ఫ్రిజ్‌లోని మురికి ఆహారాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు సులభంగా మురికి రిఫ్రిజిరేటర్ శుభ్రం చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు ఫ్రిజ్‌ను అన్‌ప్లగ్ చేసి వైర్లను తీసివేయాలి. దీని తర్వాత మీరు మొత్తం ఫ్రిజ్‌ను ఖాళీ చేయండి.

ఫ్రిజ్ డ్రాలను శుభ్రం చేయండి: ఫ్రీజర్ ఖాళీ అయిన తర్వాత డ్రాలను తీయండి. డ్రాయర్లను క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను స్పాంజి సహాయంతో ఉపయోగించండి. రిఫ్రిజిరేటర్ అన్ని అంతర్గత భాగాలు, సైడ్ భాగాలను పూర్తిగా శుభ్రం చేయండి.

బేకింగ్ సోడా, వెనిగర్ పేస్ట్: తొలగించలేని మొండి మరకలు ఉంటే, మరకపై కొంచెం వెనిగర్ రాసి స్పాంజితో స్క్రబ్ చేయండి. వెనిగర్ కూడా క్రిములను చంపడానికి సహాయపడుతుంది. మీరు బేకింగ్ సోడా, వెనిగర్ పేస్ట్ తయారు చేయడం ద్వారా రిఫ్రిజిరేటర్ తలుపు, ఇతర భాగాలను శుభ్రం చేయవచ్చు.

ఫ్రిజ్ నుండి దుర్వాసనను తగ్గించండి: మీరు టూత్ బ్రష్ సహాయం కూడా తీసుకోవచ్చు. మీ ఫ్రిజ్ దుర్వాసనగా ఉంటే, మీరు ఒక గిన్నెలో బేకింగ్ సోడాను వేసి కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా వాసనను పోగొట్టవచ్చు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి: మీరు ప్రతి నెలా ఒకసారి మొత్తం రిఫ్రిజిరేటర్‌ను లోతుగా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. తద్వారా అదనపు మురికి పేరుకుపోదు. అంతే కాకుండా చెడిపోయిన ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచవద్దు. ఇది చెడు వాసనను వ్యాపింపజేస్తుంది. ఆహారాన్ని ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో కప్పి ఉంచండి. ఈ అన్ని చిట్కాల సహాయంతో మీరు మీ ఫ్రిజ్‌ను శుభ్రం చేయవచ్చు. అలాగే మీ ఇంటిని, వంటగదిని అందంగా మార్చుకోవచ్చు.




