- Telugu News Photo Gallery Technology photos Oppo launching new color variant of Oppo K12x 5G smart phone, check here for full details
Oppo K12x 5G: రూ. 10వేలలో సూపర్ ఫీచర్స్.. మహిళలు మెచ్చే కలర్‌లో కొత్త వేరియంట్
స్మార్ట్ ఫోన్స్‌లో ఫీచర్లను మాత్రమే కాకుండా ఫోన్ కలర్‌ను కూడా దృష్టిలో పెట్టుకునే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు పింక్ కలర్ ఫేవరేట్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫీన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో కే12ఎక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Sep 24, 2024 | 1:14 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో కే12ఎక్స్ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను ఇది వరకే తీసుకొచ్చారు. అయితే తాజాగా ఈ ఫోన్‌లో కొత్త కలర్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఫీథర్ పింక్ కలర్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు.

రెండు నెలల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను ప్రస్తుతం ఫీథర్ పింక్ కలర్‌లో తీసుకొచ్చారు. త్వరలో జరగనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. మిలిటరీ -గ్రేడ్ ఎంఐఎల్ ఎస్టీడీ-810హెచ్ డ్యూరబిలిటీ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఓఎస్ వర్షన్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 720×1604 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 45 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 18 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999కాగా సేల్‌లో భాగంగా రూ. 10,999కి లభించనుంది.




