Phone Charging Slow: మీ మొబైల్‌ ఛార్జింగ్‌ స్లో అవుతుందా? ఈ అసలైన కారణాలు ఇవే!

Phone Charging Slow Problem: స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. కానీ అది ఛార్జ్ అయినప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఫోన్ బ్యాటరీ అయిపోతే దాని వల్ల ఉపయోగం ఉండదు. అందుకే తమ ఫోన్‌లను ఛార్జ్ చేసుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో ఫోన్‌ ఛార్జింగ్‌ స్లో అవుతుంటుంది. అలా ఎందుకు జరుగుతుందోనని మీరెప్పుడైనా గమనించారా? తమ ఫోన్ త్వరగా ఛార్జ్ కావడం లేదనే సమస్యను ఎదుర్కొంటారు..

Phone Charging Slow: మీ మొబైల్‌ ఛార్జింగ్‌ స్లో అవుతుందా? ఈ అసలైన కారణాలు ఇవే!
Mobile Charging
Follow us
Subhash Goud

|

Updated on: Sep 23, 2024 | 5:03 PM

Phone Charging Slow Problem: స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. కానీ అది ఛార్జ్ అయినప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఫోన్ బ్యాటరీ అయిపోతే దాని వల్ల ఉపయోగం ఉండదు. అందుకే తమ ఫోన్‌లను ఛార్జ్ చేసుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో ఫోన్‌ ఛార్జింగ్‌ స్లో అవుతుంటుంది. అలా ఎందుకు జరుగుతుందోనని మీరెప్పుడైనా గమనించారా? తమ ఫోన్ త్వరగా ఛార్జ్ కావడం లేదనే సమస్యను ఎదుర్కొంటారు. చాలా సేపు ఛార్జ్‌ చేసినా స్లో అవుతూనే ఉంటుంది. కానీ ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కాదు. మీరు కూడా అదే సమస్యను ఎదుర్కొంటుంటే అందుకు కారణాలు ఏవో తెలుసుకోండి. స్మార్ట్‌ఫోన్ ఆలస్యంగా ఛార్జింగ్ అయ్యే సమస్య ఎవరికైనా రావచ్చు. అయితే ఫోన్ ఛార్జింగ్ ఆలస్యంగా మారడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని మీకు తెలుసా..? స్మార్ట్‌ఫోన్ ఆలస్యంగా ఛార్జ్ అవడానికి కారణమేంటో తెలిస్తే , ఫోన్ లేట్ ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఫోన్ ఆలస్యంగా ఛార్జింగ్ కావడానికి గల 5 కారణాలేంటో తెలుసుకోండి.

స్లో ఛార్జ్‌ కావడానికి స్విచ్, ఛార్జర్ కేబుల్‌:

చాలా సార్లు ఫోన్ నెమ్మదిగా ఛార్జింగ్ అవ్వడానికి అతిపెద్ద కారణం స్విచ్, ఛార్జర్ లేదా పవర్ కేబుల్ పనిచేయకపోవడం. మీ ఛార్జర్ పాతది లేదా అనేక సార్లు పడిపోయినట్లయితే, దాని కేబుల్ లేదా స్విచ్ దెబ్బతినవచ్చు. ఇది కాకుండా, మీరు ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్న సాకెట్‌లో ఎటువంటి సమస్య ఉండకూడదని గుర్తుంచుకోండి. కొత్త, ప్రామాణికమైన ఛార్జర్‌ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. ఇది సమస్యను పరిష్కారం అయితే మీ ఛార్జర్‌ సరిగ్గా పని చేయడం లేదని అర్థం.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ పరిస్థితి: 

మీ ఫోన్ చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉన్న వాతావరణంలో ఉంటే బ్యాటరీ నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. కాలక్రమేణా, బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీని కారణంగా ఛార్జింగ్ సమయం పెరుగుతుంది. చల్లని మరియు పొడి ప్రదేశంలో ఫోన్‌ను ఛార్జ్ చేయండి. బ్యాటరీ చాలా పాతదైతే, దాన్ని మార్చడాన్ని ప్రయత్నించండి. ఇలా చేస్తే ఫోన్ ఛార్జింగ్ ఆలస్యం అయ్యే సమస్య నుంచి మనం బయటపడవచ్చు.

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగించడం:

చాలా మంది ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు కూడా వాడుతూనే ఉంటారు. మీరు ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని కూడా ఉపయోగిస్తే, వెంటనే అలా చేయడం మానేయండి. ఇది బ్యాటరీపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల ఛార్జింగ్ కూడా స్లో అవుతుంది. అందువల్ల ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి.

డర్టీ ఛార్జింగ్ పోర్ట్

ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా ఛార్జింగ్ సరిగ్గా జరగదు. ఛార్జింగ్‌కు ఆటంకం కలిగిస్తుంది. ఫోన్ ఛార్జింగ్ ఆలస్యమవుతోందని మీకు అనిపిస్తే, ఛార్జింగ్ పోర్ట్‌ను ఒకసారి చెక్ చేయండి. అందులో దుమ్ము, ధూళి పేరుకుపోతే శుభ్రం చేసుకోవాలి. మీరు చిన్న బ్రష్ లేదా టూత్‌పిక్ సహాయంతో ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

వైర్‌లెస్ ఛార్జింగ్:

యూఎస్‌బీ (USB) ఛార్జింగ్ కంటే వైర్‌లెస్ ఛార్జింగ్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. మీ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్‌కి కొంచెం దూరంగా ఉంటే ఛార్జింగ్ వేగం మరింత తగ్గుతుంది. వైర్‌లెస్ ఛార్జర్‌ను ఫ్లాట్ ఉపరితలంపై ఉంచండి. అలాగే ఫోన్‌ను నేరుగా దాని పైన ఉంచండి. ఈ విధంగా వైర్‌లెస్ ఛార్జింగ్‌ని ఉపయోగించడం ద్వారా ఫోన్‌ను సరిగ్గా ఛార్జ్ చేయవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి