AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Card Insurance: ఏటీఎం కార్డుపై రూ.10 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా? క్లెయిమ్‌ చేయడం ఎలా?

నేటి కాలంలో ఏటీఎం కార్డును ఉపయోగించని వారు చాలా తక్కువ మంది ఉంటారు. డిజిటల్‌ యుగం వచ్చిన తర్వాత ఏటీఎం వాడకం చాలా తగ్గిపోయింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, రూపే కార్డ్ కారణంగా ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఏటీఎం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా లావాదేవీలు కూడా సులువుగా మారాయి. ఏదైనా కొనాలంటే ఏటీఎం ద్వారా సులువుగా చేసుకోవచ్చు..

ATM Card Insurance: ఏటీఎం కార్డుపై రూ.10 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా? క్లెయిమ్‌ చేయడం ఎలా?
Atm Card
Subhash Goud
|

Updated on: Sep 23, 2024 | 2:16 PM

Share

నేటి కాలంలో ఏటీఎం కార్డును ఉపయోగించని వారు చాలా తక్కువ మంది ఉంటారు. డిజిటల్‌ యుగం వచ్చిన తర్వాత ఏటీఎం వాడకం చాలా తగ్గిపోయింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, రూపే కార్డ్ కారణంగా ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఏటీఎం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా లావాదేవీలు కూడా సులువుగా మారాయి. ఏదైనా కొనాలంటే ఏటీఎం ద్వారా సులువుగా చేసుకోవచ్చు. ఏటీఎం అనేక సౌకర్యాలను కూడా అందిస్తుందని మీకు తెలుసా? కానీ సమాచారం లేకపోవడంతో ప్రజలు దాని ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అదేవిధంగా ప్రీమియం చెల్లించకుండానే ఏటీఎం ద్వారా బీమా కూడా లభిస్తుంది.

బ్యాంకు ద్వారా ఏటీఎం కార్డు జారీ అయిన వెంటనే అదేవిధంగా, కార్డుదారులకు ప్రమాద బీమా, అకాల మరణ బీమా లభిస్తుంది. దేశంలో చాలా మందికి దీని గురించి తెలియదు. వారు డెబిట్ (ఏటీఎం) కార్డ్‌పై జీవిత బీమా రక్షణను కూడా పొందుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (డెత్) నాన్ ఎయిర్ ఇన్సూరెన్స్ డెబిట్ కార్డ్ హోల్డర్‌కు అకాల మరణానికి బీమా అందిస్తోంది.

ఏటీఎం కార్డుపై ఉచిత బీమా మొత్తం:

మీరు ఏదైనా బ్యాంకు ఏటీఎం కార్డును 45 రోజుల కంటే ఎక్కువ ఉపయోగించినట్లయితే, మీరు ఉచిత బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. ఇందులో ప్రమాద బీమా, జీవిత బీమా రెండూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ రెండు పరిస్థితుల్లోనూ బీమాను క్లెయిమ్ చేయగలుగుతారు. కార్డు కేటగిరీని బట్టి మొత్తం నిర్ణయిస్తారు. ఎస్‌బీఐ తన గోల్డ్ ఏటీఎం కార్డ్ హోల్డర్‌లకు 4 లక్షలు (ఎయిర్ ఆన్ డెత్), 2 లక్షలు (నాన్-ఎయిర్) కవర్ ఇస్తుంది. అయితే, ఇది ప్రీమియం కార్డ్ హోల్డర్‌లకు 10 లక్షలు, ఇతరులకు 5 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా అన్ని బ్యాంకులు తమ డెబిట్ కార్డ్‌లపై వివిధ మొత్తాలను కవర్ చేస్తాయి. కొన్ని డెబిట్ కార్డులు రూ. 3 కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి. ఈ బీమా కవరేజీ ఉచితంగా అందిస్తుంది. ఇందులో బ్యాంకు ఎలాంటి అదనపు పత్రాలు అడగదు.

డెబిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు చాలా ముఖ్యమైనవి:

నిర్దిష్ట వ్యవధిలోగా ఆ డెబిట్ కార్డ్ ద్వారా కొన్ని లావాదేవీలు జరిపినప్పుడే బీమా ప్రయోజనం లభిస్తుంది. వివిధ కార్డ్‌లకు ఈ వ్యవధి మారవచ్చు. కొన్ని ఏటీఎం కార్డ్‌లు బీమా పాలసీని యాక్టివేట్ చేయడానికి కార్డ్ హోల్డర్ కనీసం 30 రోజుల్లో ఒక లావాదేవీని చేయాల్సి ఉంటుంది. బీమా కవరేజీని క్లెయిమ్‌ చేయడానికి కొంతమంది కార్డ్ హోల్డర్‌లు గత 90 రోజులలోపు ఒక లావాదేవీని చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి