AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale: కస్టమర్లకు మాంచి కిక్‌ ఇస్తున్న కిక్‌ స్టార్టర్‌ డీల్స్‌.. ఈ ఫోన్లపై అమెజాన్లో ఊహించని తగ్గింపు..

కిక్‌స్టార్టర్‌ డీల్స్‌లతో వినియోగదారులకు ఆహ్వానం పలుకుతోంది. సెప్టెంర్‌ 18 నుంచి ఈ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ ప్రారంభమయ్యాయి. తాజాగా విడుదలైన బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ ఫోన్లపై మంచి ఆఫర్లను అందిస్తోంది. అంతేకాక ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఈఎంఐ లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపులు కూడా అందిస్తోంది.

Amazon Sale: కస్టమర్లకు మాంచి కిక్‌ ఇస్తున్న కిక్‌ స్టార్టర్‌ డీల్స్‌.. ఈ ఫోన్లపై అమెజాన్లో ఊహించని తగ్గింపు..
Amazon Deals
Madhu
|

Updated on: Sep 23, 2024 | 5:55 PM

Share

ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్లో ఆఫర్ల జాతరకు సమయం సమీస్తోంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్లో అన్ని రంగాలకు చెందిన వస్తువులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌లను ఆఫర్‌ చేస్తోంది. కాగా అంతకన్నా ముందే కిక్‌స్టార్టర్‌ డీల్స్‌లతో వినియోగదారులకు ఆహ్వానం పలుకుతోంది. సెప్టెంర్‌ 18 నుంచి ఈ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ ప్రారంభమయ్యాయి. తాజాగా విడుదలైన బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ ఫోన్లపై మంచి ఆఫర్లను అందిస్తోంది. అంతేకాక ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఈఎంఐ లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపులు కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్ల జాబితాలో వన్‌ ప్లస్‌, శామ్సంగ్‌, యాపిల్‌, ఐకూ, రియల్‌మీ, షావోమీ, లావా, టెక్నో వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • ఐటెల్‌ ఏ50.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. తక్కువ ధరలో మంచి ఫోన్‌ కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. దీనిని అమెజాన్లో అన్ని బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి కేవలం రూ. 5,399కి కొనుగోలు చేయొచ్చు.
  • ఐకూ జెడ్‌9 లైట్‌ 5జీ.. ఈ స్మార్ట్‌ ఫోన్లో మీడియా టెక్‌ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 50ఎంపీ ఏఐ కెమెరాతో వస్తుంది. ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసంఐపీ64 ఉంటుంది. దీనిని మీరు అమెజాన్లో అన్ని బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి కేవలం రూ. 9,499కి కొనుగోలు చేయొచ్చు. నెలకు రూ. 1,583 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకోవచ్చు.
  • ఐకూ జెడ్‌9 5జీ.. ఇది అత్యంత వేగవంతమైన కర్డ్వ్‌ స్క్రీన్ ఫోన్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రకాశవంతమైన 1800 నిట్స్ డిస్‌ప్లే, సోనీ ఐఎంఎక్స్‌882 ఓఐఎస్‌ కెమెరా, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి కేవలం రూ. 15,999కి అందుబాటులో ఉంది.
  • ఐకూ జెడ్‌7 ప్రో 5జీ.. మీకు ఏదైనా స్లిమ్, లైట్ వెయిట్‌ ఫోన్‌ కావాలంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌. ఇది 3డీ కర్డ్వ్‌ 120హెర్జ్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్‌తో నడుస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి దీనిని రూ. 19,749కి కొనుగోలు చేయొచ్చు.
  • లావా బ్లేజ్‌ 3 5జీ.. ఈ ఫోన్‌ మీడియా టెక్‌ డీ6300 ప్రాసెసర్, 50ఎంపీ + 2ఎంపీ ఏఐ కెమెరాలు, 90హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ ప్లేతో వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో కలిపి దీనిని కేవలం రూ. 9,899కి కొనుగోలు చేయొచ్చు.
  • వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ.. క్వాల్కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 ప్లస్‌ జె1 ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేస్తుంది. 100వాట్ల సూపర్‌వూక్‌ చార్జర్‌. 120హెర్జ్‌ ఫ్లూయిడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ డిస్కౌంట్‌లతో కలిపి దీనిని రూ. 26,749కి కొనొచ్చు.
  • వన్‌ ప్లస్‌ నోర్డ్‌ సీఈ 3 5జీ.. ఈ మోడల్ గరిష్టంగా 12జీబీ ర్యామ్‌,, 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 80వాట్ల సూపర్‌వూక్‌ చార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. ఫొటోల కోసం 50ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి కేవలం రూ. 16,749కి పొందొచ్చు.
  • పోవా 6 నియో 5జీ.. ఈ ఫోన్ 108ఎంపీ ఏఐ కెమెరాతో వస్తుంది, 16జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి రూ. 12,749కి లభిస్తుంది.
  • రియల్‌ మీ నార్జో ఎన్‌63.. వేగవంతమైన 45వాట్ల ఛార్జింగ్ సామర్థ్యం ఉంటుంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, గాలి సంజ్ఞ నియంత్రణలను అందిస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి కేవలం రూ. 7,155కి దీనిని పొందొచ్చు.
  • రెడ్‌మీ 13సీ 5జీ.. 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 90హెర్జ్‌ డిస్‌ ప్లే, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్లో దీని ధర రూ. 9,199గా ఉంటుంది.
  • శామ్సంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ.. ఈ ఫోన్ 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, డ్యూయల్ రికార్డింగ్, నైట్ మోడ్‌తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో దీనిని రూ. 25,749కి అమెజాన్లో కొనుగోలు చేయొచ్చు.
  • షావోమీ 14.. 50ఎంపీ లైకా ట్రిపుల్-లెన్స్ సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. డైనమిక్ 1.5కే 120హెర్జ్‌ అమోల్డ్‌ డిస్‌ ప్లేతో వస్తుంది. ఇది కూపన్, బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ. 47,999కి అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..