మెటా ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. పేరెంట్స్‌ కంట్రోలింగ్‌లోనే టీనేజర్ల ఖాతాలు

మెటా ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. పేరెంట్స్‌ కంట్రోలింగ్‌లోనే టీనేజర్ల ఖాతాలు

Phani CH

|

Updated on: Sep 23, 2024 | 9:14 PM

యుక్తవయసు పిల్లలపై సోషల్‌ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. Meta, TikTok, Google, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల కారణంగా పిల్లల దుష్ప్రభావాలకు గురవుతున్నారు. సమయం దొరికొతే చాలు యాప్‌లకు అతుక్కుపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయా సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కంప్లైంట్స్‌ వెల్లువెత్తాయి.

యుక్తవయసు పిల్లలపై సోషల్‌ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. Meta, TikTok, Google, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల కారణంగా పిల్లల దుష్ప్రభావాలకు గురవుతున్నారు. సమయం దొరికొతే చాలు యాప్‌లకు అతుక్కుపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయా సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కంప్లైంట్స్‌ వెల్లువెత్తాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్‌తో సహా 33 US రాష్ట్రాలు ఈ ప్లాట్‌ఫారమ్ ప్రమాదకరమని, ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని కంపెనీపై కోర్టుల్లో దావా వేశారు. దీంతో టీనేజర్లను కట్టడి చేసేందుకు మెటా ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పులను ప్రకటించింది. 18 ఏళ్లలోపు వినియోగదారుల కోసం సీక్రెట్‌ అండ్‌ సెక్యూరిటీ ఫీచర్‌లను అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాదు పేరెంట్స్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. అంటే పేరెంట్స్ ఇకపై టీనేజర్ల ఖాతాను కంట్రోల్‌ చేయనున్నారు. కొత్త ఫీచర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడున్న 18 ఏళ్లలోపు అన్ని ఖాతాలు “టీన్ అకౌంట్స్”గా మార్చేస్తారు. ఇది డిఫాల్ట్‌గా ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఇది కాకుండా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులు వారి తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే డిఫాల్ట్ అంటే ప్రైవేట్ సెట్టింగ్‌లను మార్చగలరు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ… అదుర్స్‌ సినిమా చూపించి ఆపరేషన్‌ చేసేసారు… రోగి మాత్రం..

ఇలా చేస్తే ముఖం మీద మచ్చలే ఉండవు

ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది !!