ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది !!

ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది !!

Phani CH

|

Updated on: Sep 23, 2024 | 8:57 PM

మనిషి జీవితంలో మెదడు ఆరోగ్యానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. మన శరీరం పని చేయడానికి శక్తి అవసరం ఉన్నట్లే, మన మెదడు కూడా బాగా పనిచేయడానికి సరైన పోషకాహారం అవసరం. కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.

మనిషి జీవితంలో మెదడు ఆరోగ్యానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. మన శరీరం పని చేయడానికి శక్తి అవసరం ఉన్నట్లే, మన మెదడు కూడా బాగా పనిచేయడానికి సరైన పోషకాహారం అవసరం. కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం కూడా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే.. మెదడు మరింత చురుగ్గా పనిచేసేందుకు ఏం తినాలి.. జ్ఞాపకశక్తి పెరిగేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?.. అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగడంతోపాటు.. ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి కొన్ని పోషకాహారాలు సూచిస్తున్నారు నిపుణులు. వాటిలో వాల్‌నట్స్‌ మొదటిది. ఇందులో మెదడుకు మేలు చేసే ఒమేగా-3 వంటి పోషకాలు ఉంటాయి. వాల్‌నట్స్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇంకా వేరుశెనగ గింజలు కూడా మెదడుకు మంచివిగా చెబుతారు. ఎందుకంటే వాటిలో మంచి కొవ్వులు-ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు కాళ్లతో ట్రాక్టర్‌ను పైకి లేపాడు.. ఆ తర్వాత..

బాలీవుడ్‌ కంటే.. టాలీవుడ్డే పైసలు ఎక్కువ ఇస్తోంది..

‘ఆ విష పూరిత బంధాన్ని తెంచుకోవడమే మంచిది’.. నాగ మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్

వందే మెట్రో కాదు.. ఇకపై నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌

13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??

Published on: Sep 23, 2024 08:44 PM