Andhra Pradesh: ఓర్నీ.. పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో
ఏపీలోని అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దాని వేగాన్ని చూసి స్థానిక గిరిజనుల భయబ్రాంతులకు లోనయ్యారు. ప్రస్తుతం ఆ సుడిగాలి వీడియో వైరల్ అవుతోంది.
అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. పొలంలో ఉన్న నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టింది. డుంబ్రిగూడ మండలం దేముడువలస- కొరొంజ్‌గూడ పొలాల్లో ఈ సుడిగాలి ప్రకోపం చూపింది. సుడిగాలి తీవ్రతను చూసి గిరిజనుల భయాందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికి శాంతించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇదే సుడిగాలి.. భారీగా వస్తే దాన్నే టోర్నడో అంటారు.
అయితే శక్తిమంతమైన టోర్నడోలు వస్తే తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. అమెరికాలో ఇలాంటి టోర్నడోలు మనుషుల్ని బలి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలో భారీగా పర్వతాలు, ఎత్తైన కొండలు ఉండటం వల్ల టోర్నడోలు ఏర్పడే అవకాశం తక్కువ. టోర్నడోలు ఏర్పడాలంటే.. భారీగా చల్లని గాలులు రావాలి. మన దేశ హిమాలయాలు.. అలాంటి గాలులు రాకుండా అడ్డుకుంటున్నాయి. అందువల్ల భారత్‌లో టోర్నడోలు పెద్దగా రావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..