13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??

తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల చిన్నారి ప్రెస్లీ షెకీనా అరుదైన ఘనత సాధించింది. సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని 800 కేజీల తృణ ధాన్యాల తో ఆయన చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. అందుకోసం దాదాపు 12 గంటలపాటు శ్రమించిన ప్రెస్లీ షెకీనా వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. చెన్నైలోని కోల్పాక్కం ప్రాంతానికి చెందిన ప్రెస్లీ షెకీనా చెన్నైలోని వెల్లమ్మాళ్ ప్రైవేట్‌ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.

13 ఏళ్ల చిన్నారి..  800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??

|

Updated on: Sep 20, 2024 | 4:45 PM

తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల చిన్నారి ప్రెస్లీ షెకీనా అరుదైన ఘనత సాధించింది. సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని 800 కేజీల తృణ ధాన్యాల తో ఆయన చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. అందుకోసం దాదాపు 12 గంటలపాటు శ్రమించిన ప్రెస్లీ షెకీనా వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. చెన్నైలోని కోల్పాక్కం ప్రాంతానికి చెందిన ప్రెస్లీ షెకీనా చెన్నైలోని వెల్లమ్మాళ్ ప్రైవేట్‌ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజు కావడంతో తృణ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకొంది. ఇందుకోసం 800 కిలోల మినుములను ఉపయోగించి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాని మోదీ భారీ చిత్రాన్ని గీసింది. చిత్రాన్ని పూర్తి చేయడానికి 12 గంటల పాటు శ్రమించింది. దీంతో ఆమె యూనిక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆర్ శివరామన్ ప్రెస్లీ షెకీనాకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్, మెడల్‌ను బహూకరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ గుళ్లో మొక్కు తీరాక పాడె ఎక్కాల్సిందే

స్పేస్‌ వాక్‌ చేసిన బిలియనీర్‌.. ఒకప్పుడు స్కూల్‌ డ్రాపౌట్‌

ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??

ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం

Follow us