ఆ గుళ్లో మొక్కు తీరాక పాడె ఎక్కాల్సిందే
చాలామంది కష్టమొచ్చినప్పుడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ గండం గడిచి గట్టెక్కితే చాలు ఫలానాది చేస్తానని మొక్కుకోవడం చూస్తుంటాం. దానికి తగ్గట్టుగా అనంతరం ఇష్టదైవం దర్శనానికి వెళ్లడం, తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు వేయడం, తులాభారం వంటివెన్నో చేస్తుంటారు. తమిళనాడులోని తంజావూర్ దగ్గరున్న వళంగైమాన్‌లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే- చనిపోయినవారిని శ్మశానవాటికకు తీసుకెళ్లేప్పుడు పాడె కడతారు కదా.
చాలామంది కష్టమొచ్చినప్పుడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ గండం గడిచి గట్టెక్కితే చాలు ఫలానాది చేస్తానని మొక్కుకోవడం చూస్తుంటాం. దానికి తగ్గట్టుగా అనంతరం ఇష్టదైవం దర్శనానికి వెళ్లడం, తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు వేయడం, తులాభారం వంటివెన్నో చేస్తుంటారు. తమిళనాడులోని తంజావూర్ దగ్గరున్న వళంగైమాన్‌లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే- చనిపోయినవారిని శ్మశానవాటికకు తీసుకెళ్లేప్పుడు పాడె కడతారు కదా. దానిమీద ఊరేగిస్తూ అంతిమ సంస్కారాలకు తీసుకెళతారు. అందుకే ఆ పేరును కూడా చాలామంది తలచుకోరు. కానీ వళంగైమాన్‌లోని మారియమ్మన్ ఆలయానికి వెళ్లిన వాళ్లు- కోరిన కోరికలు తీరాక పాడె ఎక్కాల్సిందే. మొక్కు చెల్లించాల్సిన వారెవరైనా చనిపోయినవారి మాదిరి పాడె కట్టించుకుని ఊరంతా ఊరేగిన తరవాత ఆలయానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లాక పూజారి తులసి తీర్థం చల్లాక మొక్కు తీరిపోతుంది. ఇలా చేయడం వల్ల మారియమ్మన్ ఆయురారోగ్యాలనీ అష్టైశ్వర్యాలనీ ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పేస్ వాక్ చేసిన బిలియనీర్.. ఒకప్పుడు స్కూల్ డ్రాపౌట్
ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

