Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ గురించి 10 ఆసక్తికర విషయాలు.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలియని వారంటూ ఉండరు. చాలా మంది అంబానీ గురించి ఏ విషయం అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ గురించి అన్ని ఆసక్తికరంగానే ఉంటాయి. అంబానీకి 66 ఏళ్లు. అతను 19 ఏప్రిల్ 1957న యెమెన్‌లో దిరూభాయ్ అంబానీ- కోకిలాబెన్..

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ గురించి 10 ఆసక్తికర విషయాలు.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Mukesh Ambani
Follow us
Subhash Goud

|

Updated on: Sep 23, 2024 | 3:18 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలియని వారంటూ ఉండరు. చాలా మంది అంబానీ గురించి ఏ విషయం అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ గురించి అన్ని ఆసక్తికరంగానే ఉంటాయి. అంబానీకి 66 ఏళ్లు. అతను 19 ఏప్రిల్ 1957న యెమెన్‌లో దిరూభాయ్ అంబానీ- కోకిలాబెన్ అంబానీలకు జన్మించాడు. అటువంటి పరిస్థితిలో అంబానీకి సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Ambani: అంబానీ కుటుంబం తాగే పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా? ధర తెలిస్తే షాకవుతారు!

  1. ఈ రోజు ముఖేష్ అంబానీ పేరు భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా నిలిచారు. కానీ అతను భారతదేశంలో పుట్టలేదు. అతను బ్రిటిష్ క్రౌన్ కాలనీ అయిన యెమెన్‌లో 19 ఏప్రిల్ 1957న జన్మించారు.
  2. బాంబే యూనివర్సిటీ (ఇప్పుడు ముంబై యూనివర్సిటీ) నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. తరువాత, అతను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ తీసుకున్నారు. అయితే, అంబానీ ఇక్కడ డ్రాపౌట్. ముఖేష్ తరువాత కుటుంబ వ్యాపారంలో చేరారు. కమ్యూనికేషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పెట్రోకెమికల్స్, పెట్రోలియం రిఫైనింగ్, పాలిస్టర్ ఫైబర్, చమురు, గ్యాస్ ఉత్పత్తి వంటి రంగాలలో పనిచేశారు.
  3. ఇవి కూడా చదవండి
  4. 2002లో తండ్రి ధీరూభాయ్ మరణించిన తర్వాత, ముఖేష్, అతని తమ్ముడు అనిల్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంయుక్త నాయకత్వాన్ని స్వీకరించారు. అక్కడ అంబానీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తరువాత, కొన్ని విషయాల కారణంగా ఇద్దరు సోదరుల మధ్య దూరం ఏర్పడింది. దీంతో ముఖేష్ అంబానీ ఆర్‌ఐఎల్‌ (RIL)గా గ్యాస్, చమురు, పెట్రోకెమికల్ యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు.
  5. ప్రస్తుతం ముఖేష్ అంబానీ 27-అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. దీనికి ఆంటిలియా అని పేరు పెట్టారు. ఇది ముంబైలో ఉంది. 27 అంతస్తుల భవనంలో సాంకేతికంగా 60 అంతస్తులు ఉండేలా భవనాన్ని నిర్మించారు. యాంటిలియా 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని విలువ సుమారు రూ. 15,000 కోట్లు. బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీగా మారింది.
  6. ముఖేష్ అంబానీకి రోల్స్ రాయిస్ కల్లినాన్, BMW 760 Li మొదలైన వాటితో సహా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. యాంటిలియా దిగువన ఆరు అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు. ఇది కాకుండా, ముఖేష్ అంబానీకి యూకే (UK)లోని స్టోల్ పార్క్‌లో ఉన్న మాండరిన్ ఓరియంటల్, న్యూయార్క్ అనే గ్రాండ్ లగ్జరీ హోటల్ కూడా ఉంది.
  7. ముఖేష్ అంబానీకి ప్రైవేట్ జెట్‌లు, కార్లు, ఇళ్లు, హెలికాప్టర్లు వంటి అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఇలాంటి వాటిలో కొత్త అథిది వచ్చి చేరింది. అంబానీ ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్‌ను కొనుగోలు చేశారు.
  8. అంబానీ ఇటీవల కొనుగోలు చేసిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 ధర వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాల $118.5 మిలియన్లు. అంటే దాదాపు 987 కోట్ల రూపాయలు. దీనితో బోయింగ్ 737 మ్యాక్స్ 9 దేశంలోని అత్యంత ఖరీదైన విమానాలలో ఒకటిగా మారింది.
  9.  తాజాఫోర్బ్స్‌ జాబితా ప్రకారం.. 2024 బిలియనీర్‌ జాబితా ప్రకారం.. రిలయన్స్‌ అంబానీ 116 బిలియన్‌ డాలర్ల నికర విలువతో ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 10 సంపన్నుల జాబితాలో ఉన్నారు. ముఖేష్‌ అంబానీ నాయకత్వంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్రో కెమికల్స్‌, టెలికమ్యూనికేషన్‌, రిటైల్‌, డిజిటల్‌ సర్వీసెస్‌తో సహా వివిధ రంగాలు ఉన్నాయి.
  10. రిలయన్స్ 4G ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్ సేవ కోసం 2016లో Jioని ప్రారంభించింది. నేడు ఇది 430 మిలియన్లకు పైగా కస్టమర్లను కలిగి ఉంది. ప్రస్తుతం 5జీ టెక్నాలజీ సర్వీసులను అందిస్తున్నారు.
  11. అతను గ్లోబల్ బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ 2023 ద్వారా ప్రపంచంలోని టాప్ CEOల జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. అలాగే హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐదవ CEOగా కూడా గుర్తింపు పొందారు. అంబానీ రిలయన్స్‌ను గ్రీన్ ఎనర్జీగా మారుస్తున్నారు. కంపెనీ రాబోయే 10-15 సంవత్సరాలలో పునరుత్పాదక శక్తిలో $80 బిలియన్లకుపైగా పెట్టుబడి పెట్టనుంది.

ఇది కూడా చదవండి: ATM Card Insurance: ఏటీఎం కార్డుపై రూ.10 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా? క్లెయిమ్‌ చేయడం ఎలా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి