అలాంటి SMSలను నమ్మితే.. మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ !!

అలాంటి SMSలను నమ్మితే.. మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ !!

Phani CH

|

Updated on: Sep 25, 2024 | 9:23 PM

ఆస్పత్రి బిల్లులనో.. అత్యవసరం ఉందనో మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయా? పొరపాటున మీకు డబ్బులు పంపాను. తిరిగి పంపాలంటూ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారా? మీ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు ఎస్‌ఎంఎస్‌లు చూపిస్తున్నాయా? తస్మాత్‌.. జాగ్రత్తా..! అలాంటి మెస్సేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. సైబర్‌ కేటుగాళ్లు మీ చుట్టే మాటు వేసి కాపు కాస్తున్నారు జాగ్రత్తా.

ఆస్పత్రి బిల్లులనో.. అత్యవసరం ఉందనో మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయా? పొరపాటున మీకు డబ్బులు పంపాను. తిరిగి పంపాలంటూ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారా? మీ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు ఎస్‌ఎంఎస్‌లు చూపిస్తున్నాయా? తస్మాత్‌.. జాగ్రత్తా..! అలాంటి మెస్సేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. సైబర్‌ కేటుగాళ్లు మీ చుట్టే మాటు వేసి కాపు కాస్తున్నారు జాగ్రత్తా. సందు దొరికొతే చాలు మీ ఖాతాలను టూఠీ చేసేందుకు కాచుకుని కూర్చుంటున్నారు. అమాయకులనే కాదు… బ్యాంకులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌ ట్రాన్‌జాక్షన్సే. ఇప్పుడు దీన్నే ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు సైబర్‌ నేరగాళ్లు. కొత్తకొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ అకౌంట్స్‌ నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు. ఇప్పుడు మరింత అప్‌డేట్‌ అయ్యారు. జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త మోసంతో ముందుకొస్తున్నారు. బ్యాంకు తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. అత్యసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్‌ పని చేయడంలేదని డబ్బు పంపాలంటూ మోసం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఈ తరహాలో మోసాలు పెరుగుతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టార్ హెల్త్‌ లో పాలసీ ఉందా ?? మీ డేటా డౌటే !!

స్టార్‌ హోటల్‌కెళ్లి.. చెయ్యకూడని పని చేస్తే

వ్యాక్సిన్స్‌ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి కాస్తా.. ఇలా !!

అదో దొంగల స్కూల్.. చోరీ ఎలా చేయాలో క్లాసులు చెబుతున్న క్రిమినల్స్‌