వ్యాక్సిన్స్‌ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి కాస్తా.. ఇలా !!

వ్యాక్సిన్స్‌ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి కాస్తా.. ఇలా !!

Phani CH

|

Updated on: Sep 25, 2024 | 9:10 PM

అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సిన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో నిధుల సమీకరణకు నానా బాధలు పడుతోంది.

అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సిన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో నిధుల సమీకరణకు నానా బాధలు పడుతోంది. ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పారోక్సిస్మల్ నోక్టర్నల్ హీమోగ్లోబినూరియా PNH తో బాధపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్‌లో చేరింది. చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్, న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలని ఆసుపత్రి వైద్యులు కోరారు. అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్‌ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం, దవడలు బిగుసుకుపోవడం, ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోరెంజ్‌కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడంతో నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదో దొంగల స్కూల్.. చోరీ ఎలా చేయాలో క్లాసులు చెబుతున్న క్రిమినల్స్‌

పూరీ రహస్య గదుల్లో భారీ సంపదను దాచారా ??