పూరీ రహస్య గదుల్లో భారీ సంపదను దాచారా ??

పూరీ రహస్య గదుల్లో భారీ సంపదను దాచారా ??

Phani CH

|

Updated on: Sep 25, 2024 | 9:02 PM

పూరీ ఆలయ రత్న భాండాగారం రహస్య గదుల్లో సొరంగ మార్గాలు, వాటి కింద మరిన్ని గదులున్నాయా? విలువైన సంపదను దాచారా అనే అంశాలపై బుధవారం తొలి విడత అధ్యయనం జరిగింది. కేంద్ర పురావస్తు శాఖ సహాయ డీజీ జాహ్నవిజ్‌ శర్మ నాయకత్వంలో హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త ఆచార్య ఆనందపాండే, మరో 15 మంది నిపుణులు రహస్య గదులకు లేజర్‌ స్కానింగ్‌ చేశారు.

పూరీ ఆలయ రత్న భాండాగారం రహస్య గదుల్లో సొరంగ మార్గాలు, వాటి కింద మరిన్ని గదులున్నాయా? విలువైన సంపదను దాచారా అనే అంశాలపై బుధవారం తొలి విడత అధ్యయనం జరిగింది. కేంద్ర పురావస్తు శాఖ సహాయ డీజీ జాహ్నవిజ్‌ శర్మ నాయకత్వంలో హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త ఆచార్య ఆనందపాండే, మరో 15 మంది నిపుణులు రహస్య గదులకు లేజర్‌ స్కానింగ్‌ చేశారు. అనంతరం జస్టిస్‌ శర్మ, అరవింద పాఢి, జాహ్నవిజ్‌ శర్మ విలేకరులతో మాట్లాడారు. తొలి విడతలో లేజర్‌ సర్వే జరిగిందనీ తరువాతి దశలో ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు అత్యాధునిక రాడార్, ప్రత్యేక యంత్రాలతో సొరంగ మార్గం గురించి అన్వేషిస్తారనీ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత భాండాగారం మరమ్మతులు జరుగుతాయనీ రహస్య గదుల శోధనను వెంటనే పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఉన్నామనీ అన్నారు. ఇంత వరకు జరిగిన ప్రాథమిక అధ్యయనాన్ని వీడియో తీయించామని, ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: దేవర ఎఫెక్ట్.. జాగ్రత్త పడిన పుష్ప2

కాఫీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ !! రోజుకు 3 కప్పులు కాఫీతో ??

చికెన్ గున్యాతో బాధపడుతున్నా.. బాడీ పెయిన్స్ భరిస్తూనే ఈవెంట్‌కు చిరు…

మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి మా బిడ్డను బద్నాం చేయకండి !!

Mathu Vadalara 2: OTTలోకి వచ్చేస్తున్న మత్తు వదలరా 2