Mathu Vadalara 2: OTTలోకి వచ్చేస్తున్న మత్తు వదలరా 2

Mathu Vadalara 2: OTTలోకి వచ్చేస్తున్న మత్తు వదలరా 2

Phani CH

|

Updated on: Sep 24, 2024 | 1:46 PM

MM కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి, కమెడియన్ సత్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మత్తు వదలరా 2. 2019లో సైలెంట్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరాకు ఇది సీక్వెల్. రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించింది. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తి రేకెత్తించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది.

MM కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి, కమెడియన్ సత్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మత్తు వదలరా 2. 2019లో సైలెంట్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరాకు ఇది సీక్వెల్. రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించింది. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తి రేకెత్తించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పటికీ థియేటర్లలో ఆడియెన్స్ ను నవ్విస్తోన్న మత్తు వదలరా 2 మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇందుకోసం ఓటీటీ సంస్థ, మూవీ మేకర్స్ మధ్య భారీ డీల్ కుదిరిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాతే మత్తు వదలరా 2 సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా నెట్‌ ఫ్లిక్స్, మూవీ మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అంటే ఈ లెక్కన మత్తు వదలరా 2 అక్టోబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘దేవర’లో నటించాలి !! బలంగా కోరుకున్న జాన్వి !!

పోనీలే !! కనీసం రెమ్యునరేషన్ అయినా గట్టిగానే దక్కింది

ఓవర్ యాక్షన్ చేశాడు.. దెబ్బకు గెటౌట్ అయ్యాడు !! ఇవే తగ్గించుకోవాలి భయ్యా !!

షూటింగ్‌ మొదలెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.. దటీజ్ పవన్‌ !!