అదో దొంగల స్కూల్.. చోరీ ఎలా చేయాలో క్లాసులు చెబుతున్న క్రిమినల్స్‌

అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్‌ వంటి సరంజామా ఉంది. వెంటనే పాఠం మొదలుపెట్టాడు. అంటే ఏవో సైన్స్‌ ప్రాక్టికల్స్‌ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు. పిక్‌ పాకెటింగ్‌ ఎలా చేయాలి?

అదో దొంగల స్కూల్.. చోరీ ఎలా చేయాలో క్లాసులు చెబుతున్న క్రిమినల్స్‌

|

Updated on: Sep 25, 2024 | 9:04 PM

అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్‌ వంటి సరంజామా ఉంది. వెంటనే పాఠం మొదలుపెట్టాడు. అంటే ఏవో సైన్స్‌ ప్రాక్టికల్స్‌ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు. పిక్‌ పాకెటింగ్‌ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్‌ చేయాలి వంటి అంశాల్లో అక్కడ తర్ఫీదు ఇస్తారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్‌ ఖేడి, హుల్‌ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లల్నే లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాది పాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూరీ రహస్య గదుల్లో భారీ సంపదను దాచారా ??

Follow us