AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్‌.. ఆ సమస్యకు చెక్‌ పెట్టే కొత్త ఏఐ టూల్‌

అయితే తాజాగా ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్‌ను తీసుకొస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సేవను బుధవారం ప్రారంభించగా, గురువారం నుంచి వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ట్రూకాలర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఈ కొత్త సేవలు తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది...

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్‌.. ఆ సమస్యకు చెక్‌ పెట్టే కొత్త ఏఐ టూల్‌
Airtel
Narender Vaitla
|

Updated on: Sep 26, 2024 | 10:11 AM

Share

ప్రస్తుతం చాలా మంది మొబైల్ యూజర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో స్పామ్‌ కాల్స్‌, మెసేజెస్‌ ఒకటి. రకరాల పేర్లతో రోజూ ఎన్నో స్పామ్ కాల్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా లోన్‌ల పేరుతో, ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసే ఫేక్‌ కాల్స్‌ ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు చాలా మంది ఉపయోగించే యాప్‌ ట్రూ కాలర్‌. అవతలి నుంచి వస్తున్న కాల్ ఎవరిదన్న విషయాన్ని ముందే చేప్పేసే ట్రూ కాలర్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు.

అయితే తాజాగా ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్‌ను తీసుకొస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సేవను బుధవారం ప్రారంభించగా, గురువారం నుంచి వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ట్రూకాలర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఈ కొత్త సేవలు తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ టూల్ సహాయంతో అనుమానిత స్పామ్ కాల్స్, ఎస్ ఎంఎస్ లకు రియల్ టైమ్ లో కస్టమర్లను అప్రమత్తం చేస్తుంది. వినియోగదారుడు ఏ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎయిర్ టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీస్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ కావడం విశేషం.

స్పామ్‌ కాల్స్‌ ద్వారా సంభవించే మోసాలను నిరోధించడానికి ఈ టూల్ ఉపయోగపడుతుందిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విట్టల్ తెలిపారు. ఈ టూల్‌ను ఏడాదిగా పరీక్షిస్తున్నామని, ప్రతిరోజూ 100 మిలియన్ల స్పామ్ కాల్స్, 3 మిలియన్ స్పామ్ ఎస్ఎంఎస్ లను గుర్తించగలిగింది. 2 మిలియన్ స్పామర్లను బ్లాక్ చేసిందని ఆయన తెలిపారు.

ఇక ఎయిర్‌ తీసుకొచ్చిన ఈ కొత్త టూల్‌లో డ్యూయల్ లేయర్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఇందులో ఒకటి నెట్ వర్క్ లేయర్ వద్ద, రెండోది ఐటీ సిస్టమ్స్ లేయర్ వద్ద. ప్రతి కాల్, ఎస్ఎంఎస్ ఈ డ్యూయల్ లేయర్డ్ అల్ షీల్డ్ గుండా వెళ్తుంది. ప్రతిరోజూ 1.5 బిలియన్ మెసేజ్‌లను, 2.5 బిలియన్ కాల్స్ ను ఇది ప్రాసెస్ చేస్తుంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే హానికరమైన లింక్‌లను కూడా ఈ సాఫ్ట్ వేర్ వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. దీని కోసం, బ్లాక్ లిస్ట్ చేయబడిన యుఆర్ఎల్ లు, ప్రతి ఎస్ఎంఎస్ కేంద్రీకృత డేటాబేస్ రియల్ టైమ్ ప్రాతిపదికన స్కాన్ చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..