- Telugu News Photo Gallery Amaranth Benefits For Weight Loss Or Diabetes And Rajgira Health Benefits As Per Experts
Rajgira Benefits: మంచి ఆరోగ్యం కోసం.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే.. సూపర్ రిజల్ట్!
రాజ్‌గిరాను అమరాంత్ లేదా రామదాన ధాన్యాలు అని కూడా పిలుస్తారు. గోధుమ, బియ్యం వంటి ఇతర ప్రధాన ఆహారాలతో పోలిస్తే.. ఇది చాలా పోషకమైనది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాజ్‌గిరా కూడా తృణధాన్యాల్లో ఒకటిగా పిలుస్తారు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులో మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. అంతేకాకుండా ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గేలా చేస్తుంది. రాజ్‌గిరాను మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: Sep 28, 2024 | 8:56 AM

రాజ్‌గిరాలో యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని కూడా తగ్గిస్తుంది.

రామదాన గింజల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జంతు ప్రొటీన్‌లా క్వాలిటీగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు ప్రొటీన్ చాలా అవసరం. ఎముకలు, కండరాలు, చర్మం, రక్తం పెరుగుదలకు ప్రొటీన్ అవసరం. శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకూ ప్రొటీన్ తోడ్పడుతుంది. అమరాంత్ సీడ్స్ గ్లూటెన్ ఫ్రీ. గ్రూటెన్ అలెర్జీ ఉన్నవారు దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలు దరిచేరవు.

గింజల్లోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, పేగుల కదలికలు సక్రమంగా జరిగేలా చూసుకుంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తోటకూర గింజలు ఆహారంగా తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. రాజ్‌గిరాలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. మాంగనీస్ మెదడుకు చాలా ముఖ్యమైనది. కొన్ని నాడీ సంబంధిత పరిస్థితుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అంతే కాదు, ఉపవాస సమయంలో వినియోగించే రాజ్‌గిరా ఐరన్‌కు ప్రధాన వనరుగా పనిచేస్తుంది.

రాజ్‌గిరాలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి, ఇంకా, అధిక ఫైబర్ తీసుకోవడం శరీర కొవ్వు, బరువు పెరుగుట ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి, ఖచ్చితంగా మీ ఆహారంలో రాజ్‌గిరాను చేర్చుకోండి.

రామదాన గింజల్లోని పెపైడ్‌లకు యాంటీఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. తోటకూర గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు.. శరీర కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఎముక వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని మంటను తగ్గిస్తాయి.




