పొడిబారిన జుట్టు సమస్యకు కూడా కాకర మంచి మందుగా పనిచేస్తుంది. ఇందుకోసం కాకరకాయ రసం మీ జుట్టును అనేక సమస్యల నుండి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ బి1, బి2, బి3 మరియు సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫాస్పరస్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. జుట్టు రాలే సమస్యకు కాకర రసం ఔషధంగా పనిచేస్తుంది.అరకప్పు కాకర రసాన్ని తీసుకొని, అందులో చెంచా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, మాడుకు పట్టించి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. 40నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు అప్త్లె చేస్తే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుందని అంటున్నారు.