9వ తరగతి పాసైన ‘డాక్టర్’.. పట్టాలేకుండానే 20 ఏళ్లుగా సర్జరీలు..! ఎట్టకేలకు ఇలా

ఈ క్రమంలోనే ఓ పేషెంట్‌కి ఆపరేషన్‌ తర్వాత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ రావడంతో మళ్లీ డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో అతడి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. వైద్యుడి అనుచిత వైఖరి, పొంతనలేని సమాధానాలు చెప్పకపోవడంతో రోగికి అనుమానం వచ్చింది. అనుమానం పెరగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశాడు.

9వ తరగతి పాసైన ‘డాక్టర్’.. పట్టాలేకుండానే 20 ఏళ్లుగా సర్జరీలు..! ఎట్టకేలకు ఇలా
Fake Doctor
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 28, 2024 | 1:46 PM

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన శంకర్‌దాదా MBBS సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా..? అందులో డిగ్రీ లేని వ్యక్తి తల్లిదండ్రుల కోసం డాక్టర్‌గా యాక్ట్‌ చేస్తుంటాడు..కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం ప్రజల్ని మోసం చేస్తూ ఆ సినిమా కథను నిజం చేశాడు. కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదివిన ఓ వ్యక్తి తాను డాక్టర్‌నని చెప్పుకుంటూ రోగులకు సర్జరీలు కూడా చేశాడు. ఆశ్చర్యకరంగా అతను గత 20 ఏళ్లుగా వైద్య వృత్తిలోనే దర్జాగా చెలామనీ అవుతున్నాడు. అంతేకాదు..ఈ నకిలీ డాక్టర్ తనను తాను ఓ పేరున్న కాలేజీలో చదువుకున్న వైద్యుడిగా పరిచయం చేసుకుని సొంతగా క్లినిక్‌ని తెరిచాడు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చికిత్స కోసం అతని వద్దకు వచ్చేవారు. వారిసమస్యలకు సంబంధించి చిన్నపాటి చికిత్స, మందులు ఇస్తూ మీ రోగాలు పూర్తిగా నయమయ్యాయని భరోసా ఇచ్చేవాడు. అలా ప్రజల్లో గొప్ప వైద్యుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈ షాకింగ్‌ థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే…

థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం 9వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. కానీ, తానో గొప్ప డాక్టర్‌ని అంటూ సొంతంగా హాస్పటల్‌ ఏర్పాటు చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం, చికిత్సలు అందించటంలో అతను సక్సెస్‌ అయ్యాడు. దాంతో అతని క్లినిక్‌కి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నకిలీ డాక్టర్‌ కేవలం మందులు మాత్రమే కాదు.. చిన్న చిన్న సర్జరీలు కూడా చేసేవాడు.. ఈ క్రమంలోనే ఓ పేషెంట్‌కి ఆపరేషన్‌ తర్వాత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ రావడంతో మళ్లీ డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో అతడి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. వైద్యుడి అనుచిత వైఖరి, పొంతనలేని సమాధానాలు చెప్పకపోవడంతో రోగికి అనుమానం వచ్చింది. అనుమానం పెరగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశాడు.

పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ నకిలీ సర్జన్‌ను పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసినప్పుడు, అతను మెడిసిన్ చదవలేదని, తనకు ఎలాంటి మెడికల్ లైసెన్స్ సర్టిఫికెట్‌ కూడా లేదని అంగీకరించాడు. లైసెన్స్ లేకుండా అక్రమ క్లినిక్ నడుపుతున్నందుకు, ప్రాక్టీస్ చేస్తున్నందుకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..