AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: స్కూల్‌లో వింత ఆకారంలో ముగ్గు.. విద్యార్థులు దగ్గరికి వెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది..

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం జడ్పీ స్కూల్లో క్షుద్ర పూజలు కలకలం తీవ్ర కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ముగ్గు, పరిసరాలు చూసి టీచర్లు, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.

AP News: స్కూల్‌లో వింత ఆకారంలో ముగ్గు.. విద్యార్థులు దగ్గరికి వెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది..
Black Magic
Maqdood Husain Khaja
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 28, 2024 | 1:29 PM

Share

మనం ఎంత దైర్యవంతులమైన.. కొన్నింటిని చూసి భయపడుతాం. ముఖ్యంగా ముగ్గు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గాజులు కనబడితే గుండె జారినంత పని అవుతుంది. తీరా ఏంటా అని దగ్గరికి వెళ్లి చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి సంఘటననే అనకాపల్లి జిల్లాలోని ఓ పాఠశాల జరిగింది. రోజు మాదిరిగానే ఉదయాన్నే విద్యార్థులు స్కూల్‌కి చేరుకుంటున్నారు.. టీచర్లు కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు.

స్కూలు ప్రహరీ గేటు లోపలికి అడుగుపెట్టగానే అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అప్పటికే లోపలికి వెళ్ళిన వాళ్లలో ఒకటే ఆందోళన మొదలైంది. అక్కడికి చేరుకున్న మరి కొంతమందిలోనూ భయం పుట్టింది. అసలు విషయం ఏంటంటే అక్కడ.. ఓ ముగ్గు అందరినీ భయపెట్టింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం జడ్పీ స్కూల్లో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ముగ్గు, పరిసరాలు చూసి టీచర్లు, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ముగ్గు వేసి అందులో పూజలు కుంకుమ పసుపు ఉండడం అందరిలో ఆందోళన పెంచింది.

అది కూడా అర్ధరాత్రి పూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించాయి. స్కూల్లో ఒక క్షుద్ర పూజలు ఎవరు చేస్తారా అన్న అనుమానం మొదలైంది. విషయం ఆ నోట ఈ నోట పాకింది. గ్రామమంతా విస్తరించింది. చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం పాకింది. దీంతో అందరిలో ఒకటే భయం. విద్యార్థుల పేరెంట్స్‌లో ఆందోళన మొదలైంది. ఉపాధ్యాయుల్లోనూ ఒకింత భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీచర్స్, పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే విద్యార్థుల్లో భయం నెలకొన్న నేపథ్యంలో వెంటనే ఆ ముగ్గును తొలగించారు. బాధ్యులు ఎవరానే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ మధ్య క్షుద్ర పూజలు చేసేవారు ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం మూఢనమ్మకాలపై ఎంత అవగాహన కల్పించినా, అవగాహన సదస్సులు నిర్వహించినా కొందరిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా క్షుద్రపూజలు ఎక్కువగా గ్రామాల్లో దర్శనమిస్తుంటాయి. ఇప్పటికైనా ప్రజలు మూఢనమ్మకాలు వీడాలని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.