Kitchen Hacks: ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా..? ఐతే ఇలా చేయండి..

చాలా ఇళ్లల్లో నెలకు ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు అవసరమవుతాయి. మీరు అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మేము మీకు కొన్ని చిట్కాలను చెప్పబోతున్నాం. వీటిని అనుసరించడం ద్వారా మీరు గ్యాస్ సిలిండర్‌ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Kitchen Hacks: ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా..? ఐతే ఇలా చేయండి..
Gas Cylinder Saving Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2024 | 8:21 AM

వంట చేసేటప్పుడు గ్యాస్‌ను ఎలా ఆదా చేయాలి: LPG గ్యాస్.. ఇప్పుడు దాదాపు అన్ని వంటిళ్లలో ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ స్టవ్‌పై వండుకునే ఓపిక నేటి తరానికి లేదు. దీని ప్రకారం, పొయ్యిపై వంటకోసం కాల్చడానికి అవసరమైన కలప కూడా కొరతగా మారింది. ఈ నేపథ్యంలోనే గ్రామాలు, పట్టణాల్లో ప్రతిచోటా గ్యాస్ సిలిండర్ ఉపయోగించి వంట చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలా ఇళ్లల్లో నెలకు ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు అవసరమవుతాయి. మీరు అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మేము మీకు కొన్ని చిట్కాలను చెప్పబోతున్నాం. వీటిని అనుసరించడం ద్వారా మీరు గ్యాస్ సిలిండర్‌ను సులభంగా ఆదా చేసుకోవచ్చు

తడి పాత్రలు వాడొద్దు:

చాలా సార్లు హడావుడిగా వంట చేసేటప్పుడు తడి పాత్రను స్టవ్ మీద పెడుతుంటారు. కానీ, ఇది సరైనది కాదు. తడి గిన్నెలు స్టౌవ్‌ మంటకు వేడేక్కుతాయి. కానీ, ఈ మొత్తం ప్రక్రియలో చాలా గ్యాస్ వృధా అవుతుంది. వంట చేయడానికి ముందు పాత్రలను కాటన్ క్లాత్‌తో తుడిచి ఆరబెట్టుకోవటం మంచిది.

ఇవి కూడా చదవండి

ప్రెజర్ కుక్కర్ ఉపయోగించండి:

ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం వండటం చాలా ఈజీ. అందుకే చాలా మందికి ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే పెద్దగా రిస్క్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా ఆహారాన్ని వండడానికి సహాయపడుతుంది. అదేవిధంగా గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. వంట ఆలస్య అవ్వడం ఎందుకని ఆలోచించేవారు దీని వైపు మెుగ్గు చూపుతారు.

పాత్రలపై ఎప్పుడూ మూత పెట్టి ఉడికించాలి:

మూతపెట్టి వండిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు నశించకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

స్టవ్ బర్నర్స్ శుభ్రంగా ఉంచుకోవాలి:

బర్నర్ శుభ్రంగా ఉంచడం వల్ల స్టవ్ మంట బాగా మండుతుంది. దీని కారణంగా, పాత్ర తక్కువ సమయంలో వేడెక్కుతుంది. తక్కువ గ్యాస్ వినియోగిస్తుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..