Surya Grahan 2024: సూర్య గ్రహణంతో ఆ రాశుల వారికి ఇబ్బందులు.. పరిహారాలు ఏంటో తెలుసుకోండి..

అక్టోబర్ 2వ తేదీన కన్యా రాశిలో సూర్య, చంద్ర, కేతువులు కలుసుకోవడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, దాని ప్రభావం మాత్రం వివిధ రాశుల వారి మీద సానుకూలంగానో, ప్రతికూలంగానో పడే అవకాశం ఉంది. ఈ సూర్య గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు లభించడం జరుగుతుంది.

Surya Grahan 2024: సూర్య గ్రహణంతో ఆ రాశుల వారికి ఇబ్బందులు.. పరిహారాలు ఏంటో తెలుసుకోండి..
Surya Grahan 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 29, 2024 | 8:23 PM

అక్టోబర్ 2వ తేదీన కన్యా రాశిలో సూర్య, చంద్ర, కేతువులు కలుసుకోవడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, దాని ప్రభావం మాత్రం వివిధ రాశుల వారి మీద సానుకూలంగానో, ప్రతికూలంగానో పడే అవకాశం ఉంది. ఈ సూర్య గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు లభించడం జరుగుతుంది. ఈ సూర్య, చంద్ర, కేతువులతో ఉచ్ఛ బుధుడు కూడా చేరినందువల్ల, ఈ గ్రహాలను గురువు చూస్తున్నందువల్ల సాధారణంగా ఏ రాశికీ అశుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉండదు. ఏది ఏమైనా, వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారు జాగ్రత్తగా ఉండడంతో పాటు, పరిహారాలు చేయడం మంచిది. ఈ గ్రహణ ఫలితాలు ఈ నెల 17న ఏర్పడే పౌర్ణమి వరకూ వర్తిస్తాయి.

  1. వృషభం: ఆలోచన, ప్రతిభ, పిల్లలు, అదృష్టం వంటి అంశాలకు సంబంధించిన పంచమ స్థానంలో సూర్య గ్రహణం పట్టడం వల్ల ఉద్యోగంలో ప్రాభవం తగ్గే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించదు. రొటీన్ వ్యవహారాల్లో మాత్రమే విజయాలు సాధిస్తారు. పిల్లలకు చదువుల్లో ఏకాగ్రత, శ్రద్ధ తగ్గుతాయి. మనసంతా అలజడిగా, ఆందోళనగా ఉంటుంది. ఒకటి రెండు దుర్వార్తలు వినే సూచనలున్నాయి. ఆదాయం తగ్గుతుంది. ఆదిత్య హృదయం పారాయణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో ఈ గ్రహణం ఏర్ప డుతున్నందువల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా అనేక వ్యవహారాలను చక్క బెట్టాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబపరంగా కొన్ని చిక్కు సమస్యలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది. గ్రహణం రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం చదువుకోవడం మంచిది.
  3. కన్య: ఈ రాశిలో గ్రహణం పడుతున్నందువల్ల మనశ్శాంతి తగ్గే విషయాలు అనేకం జరిగే అవకాశం ఉంది. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ప్రయా ణాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా ఒక పట్టాన కలిసి రాదు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. శుభ కార్య ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ప్రాభ వం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దుర్గాదేవిని స్తుతించడం మంచిది.
  4. తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల కష్టార్జితంలో చాలా భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. మిత్రుల వల్ల కూడా నష్టపోతారు. నష్టదాయక వ్యవహారాల వల్ల ఇబ్బంది పడ తారు. కొన్ని ముఖ్యమైన అవకాశాలు చేతి దాకా వచ్చి ఆగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయ త్నాలు వెనుకపట్టు పడతాయి. లలితా సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది.
  5. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో సూర్య గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి పెరుగుతుంది. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారిలో ఆత్మ విశ్వాసం, ధైర్యం తగ్గి మానసిక ఆందోళనలు కలుగుతాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి వివాదం మరింత జటిలంగా మారుతుంది. శివ స్తోత్రంతో గ్రహణ ప్రభావం చాలావరకు తగ్గుతుంది.
  6. మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల వ్యక్తిగత సమస్యలు వృద్ధి చెందే అవ కాశం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం, పురోగతి విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తాయి. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. ముఖ్యమైన పనులకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. గ్రహణం రోజున దత్తాత్రేయ స్వామిని స్మరించడం మంచిది.