AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Horoscope: సొంత రాశుల్లో మూడు గ్రహాలు.. ఈ ఏడాది అత్యంత అదృష్టవంతులు వీరే!

శని, శుక్ర, బుధులు తమ తమ రాశుల్లో ఉండడమనేది ఎప్పుడో తప్ప జరగదు. శని వచ్చే ఏడాది వరకూ స్వక్షేత్రమైన కుంభరాశిలోనే సంచారం చేస్తాడు కానీ, బుధుడు తన స్వక్షేత్రమైన కన్యా రాశిలో, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో మరో పది పదిహేను రోజులు సంచారం చేయడం జరుగుతుంది. దీంతో కొన్ని రాశులవారు రెండు మూడు నెలల పాటు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. చీకూ చింతా లేకుండా జీవితం గడిచిపోవడంతో పాటు పూర్తిగా జీవనశైలే మారిపోయే అవకాశం ఉంది.

Lucky Horoscope: సొంత రాశుల్లో మూడు గ్రహాలు.. ఈ ఏడాది అత్యంత అదృష్టవంతులు వీరే!
Lucky Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 29, 2024 | 8:14 PM

Share

శని, శుక్ర, బుధులు తమ తమ రాశుల్లో ఉండడమనేది ఎప్పుడో తప్ప జరగదు. శని వచ్చే ఏడాది వరకూ స్వక్షేత్రమైన కుంభరాశిలోనే సంచారం చేస్తాడు కానీ, బుధుడు తన స్వక్షేత్రమైన కన్యా రాశిలో, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో మరో పది పదిహేను రోజులు సంచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రహాల స్వక్షేత్ర సంచారం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందబోతున్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులే. ఈ రాశులవారు రెండు మూడు నెలల పాటు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. చీకూ చింతా లేకుండా జీవితం గడిచిపోవడంతో పాటు పూర్తిగా జీవనశైలే మారిపోయే అవకాశం ఉంది. వీరికి ఆదాయపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి, వ్యాపారాలపరంగా సరికొత్త లాభదాయక అవకాశాలు తప్పకుండా అంది వస్తాయి.

  1. వృషభం: ఈ రాశివారికి ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో వేతనాలతో పాటు, ఉన్నత స్థానాలు లభిస్తాయి. ఇదే రాశిలో గురు సంచారం కూడా జరుగు తున్నందువల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలుగుతారు. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా వీరికి అనేక అవకాశాలు లభిస్తాయి. వీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. జీవనశైలి మారిపోతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి.
  2. మిథునం: ఈ రాశికి మహా భాగ్య యోగం పడుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ ఊహిం చని స్థాయిలో పెరుగుతుంది. ఆర్థికంగా, కెరీర్ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తితో పెళ్లి ఖాయ మవుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. విదేశీ అవకాశాలు అనేకం అంది వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి విదేశీ పర్యటనలకు అవకాశం ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది.
  3. కన్య: ఈ రాశివారికి శని, శుక్ర, బుధులు మూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకోకుండా అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. వారసత్వ సంపద లభించే అవకాశం కూడా ఉంది. జీవితం ఆర్థికపరంగా దాదాపు పూర్తిగా మారిపోయే అవ కాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తేలికగా ఫలిస్తాయి. కెరీర్ నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.
  4. తుల: ఈ రాశికి ఊహించని స్థాయిలో కొన్ని అదృష్టాలు పడతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. పితృవర్గం వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్య లన్నీ పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు విదేశీ ప్రయత్నాలు బాగా అను కూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది.
  5. మకరం: ఈ రాశికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసు కున్న సొమ్ము, బాకీలు, బకాయిల వంటివన్నీ చేతికి అందడం జరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి పెండింగులో ఉన్న తీర్థయాత్రలు, విహార యాత్రల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్య స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలను లాభాల బాట పట్టించడానికి చేయూత అందుతుంది. ఊహించని విధంగా ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
  6. కుంభం: ఈ రాశికి ఏలిన్నాటి శనికి సంబంధించిన కష్టనష్టాలన్నీ చాలావరకు తొలగిపోతాయి. పెళ్లి ప్రయ త్నాలు, ప్రేమ వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెంది, సమస్యలు తీరిపోతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి