మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుక్ర, బుధ, రవి గ్రహాల అనుకూలత కారణంగా అన్ని విషయాల్లోనూ, అన్ని ప్రయత్నాల్లోనూ వృద్ధి, పురోగతి ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరిగి, ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తరచూ శివార్చన చేయించడం వల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.