Amla Juice: రోజూ ఈ జ్యూస్ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
కరోనా మహమ్మారి మానవాళి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. కరోనా తగ్గినా దాని ప్రభావం పోస్ట్ కోవిడ్ రూపంలో చూపిస్తూనే ఉంది. ఈ మహమ్మారి మనిషిలోని ఇమ్యూనిటీపై దాడి చేసింది. దీంతో ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రకరకాల మార్గాలు అవలంభిస్తున్నారు. అయితే నిపుణులు పౌష్టికాహారంతో సహజంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా మహమ్మారి మానవాళి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. కరోనా తగ్గినా దాని ప్రభావం పోస్ట్ కోవిడ్ రూపంలో చూపిస్తూనే ఉంది. ఈ మహమ్మారి మనిషిలోని ఇమ్యూనిటీపై దాడి చేసింది. దీంతో ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రకరకాల మార్గాలు అవలంభిస్తున్నారు. అయితే నిపుణులు పౌష్టికాహారంతో సహజంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. దీనిని ప్రకృతి నుంచి సహజంగా లభించే పండ్లు, కూరగాయలు ద్వారా పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో రోజూ ఉసిరిని రసం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు.
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చాలా సమస్యలొస్తాయి. అందుకే దానిని తగ్గించుకోవాలి. ఉసిరిని జ్యూస్‌లా చేసి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం శరీరంలో వాపును తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపిస్తుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది, జీర్ణ సమస్యలను నివారిస్తుంది. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ఉసిరి జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉసిరి ఒక నిర్విషీకరణ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెరుగైన ఆరోగ్యం కోసం టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. UV నష్టం నుండి రక్షిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిలోని పోషక గుణాలు వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండెను కాపాడుతుంది. అధిక రక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.