AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీశైలం మీదుగా బుల్లెట్ ట్రైన్‌కు ప్రతిపాదన..

తెలంగాణలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల మార్గాల్లో కీలక మార్పులు రానున్నాయి. హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్‌లను మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి రైల్వే శాఖను కోరారు. చెన్నై మార్గాన్ని కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కన, బెంగళూరు మార్గాన్ని శ్రీశైలం మీదుగా చేపట్టాలని సూచించారు.

Telangana: సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీశైలం మీదుగా బుల్లెట్ ట్రైన్‌కు ప్రతిపాదన..
Telangana Seeks New Alignment For Hyderabad Chennai Bullet Train Corridor
Krishna S
|

Updated on: Oct 02, 2025 | 10:48 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో బల్లెట్ రైలుకు సంబంధించి పలు కీలక మార్పులు జరగనున్నాయి. హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టుల అలైన్‌మెంట్లలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖను కోరింది. సెప్టెంబర్ 11న రైల్వే అధికారులతో జరిగిన మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ రెండు హైస్పీడ్ కారిడార్లకు కలిపి మొత్తం రూ. 3.30 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

హైదరాబాద్-చెన్నై మార్గం మార్పు

తెలంగాణ ప్రభుత్వం కోరిన ప్రధాన మార్పులు ఇవే:

రైల్వే ప్రతిపాదన: హైదరాబాద్‌ నుంచి విజయవాడ నేషనల్ హైవే మార్గంలో (నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం) మీదుగా చెన్నైకి.

ప్రభుత్వం కోరిన మార్పు: శంషాబాద్ నుంచి మిర్యాలగూడ వైపుగా అమరావతికి వేసే కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పక్కనుంచి ఈ రైలు మార్గం ఉండాలి.

కొత్త హైవే పక్కనుంచి వెళ్తే రోడ్డు వేసే ఖర్చు, సమయం తగ్గుతాయని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రూ. 1.86 లక్షల కోట్లు అంచనా వ్యయంతో కూడిన ఈ మార్పునకు సంబంధించి జీఎం అనుమతి వచ్చిన తర్వాతే సర్వే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో సూచనలు

రూ. 1.44 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన హైదరాబాద్-బెంగళూరు కారిడార్ అలైన్‌మెంట్ విషయంలోనూ ప్రభుత్వం పలు సూచనలు చేసింది.

ప్రభుత్వం ప్రతిపాదన: శ్రీశైలం మీదుగా రోడ్డు వేయాలి. ఎందుకంటే, శ్రీశైలానికి ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్‌తో నేషనల్ హైవే వస్తుంది.

రైల్వే ఆలోచన: అయితే శ్రీశైలం గుండా ఈ రైలు మార్గం వేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుందని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల నిర్మాణం మూడు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక/తమిళనాడు) మీదుగా జరగనుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం