ఆధ్యాత్మిక నగరం యాదాద్రికి మరిన్ని హంగులు.. అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమిపూజలో పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా 99.55 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.43.80 కోట్లతో అత్యాధునిక వసతులతో వేద పాఠశాల నిర్మాణం. రూ.43.12 కోట్లతో భక్తులు, దీక్షాపరుల వసతి కోసం ప్రత్యేక సదనాలు, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ.9.87 కోట్లతో మండప నిర్మాణం, వైకుంఠ ద్వారం నుండి కొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రూ.1.41 కోట్లతో పైకప్పు నిర్మాణం పనులు చేపట్టనున్నారు. అలాగే రథశాల వైపు ఉన్న మాడవీధులకు రూ.1.35 కోట్లతో మెట్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, యాదాద్రిని మరింత ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
