Telangana POLYCET 2026 Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
TG POLYCET 2026 results: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు శనివారం (మే 23) విడుదలయ్యాయి. మే 23 ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను ప్రకటించారు.

పాలిటెక్నిక్‌లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మే 23 శనివారం ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఎస్‌వీ భవన్‌లో ఉన్న ఎస్‌బీటీఈటీ కార్యాలయం నుంచి సాంకేతిక విద్యా కమిషనర్ పాలిసెట్ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో ‘ఎల్‌పీసెట్ 2026’ ఫలితాలను కూడా అధికారులు విడుదల చేయడం విశేషం. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కీని మే 14న విడుదల చేయగా, అభ్యంతరాలను 16వ తేదీ వరకు స్వీకరించారు. మే 13, 2026న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్షను ఆఫ్‌లైన్ (OMR షీట్) విధానంలో నిర్వహించారు.
రెండున్నర గంటల పాటు జరిగిన ఈ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. మొత్తం 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఈ మార్కులు ఆధారంగా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి.
విద్యార్థులు TG POLYCET ఫలితాలు ఎలా చూసుకోవాలి:
- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అధికారిక TG POLYCET పరీక్షా పోర్టల్‌లను సందర్శించే ముందు తమ లాగిన్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
- భవిష్యత్ కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియల కోసం ముద్రించిన ర్యాంక్ కార్డులను జాగ్రత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు విద్యార్థులకు సలహా ఇచ్చారు.
- ఆన్‌లైన్‌లో అధికారిక TG POLYCET పరీక్షా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఫలితం లేదా ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను తెరవండి.
- అవసరమైన లాగిన్ ఫీల్డ్‌లలో హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.
- ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పుట్టిన తేదీ వివరాలను జాగ్రత్తగా అందించండి.
తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
వరంగల్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
పాలిసెట్‌లో 82.94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాలిసెట్‌లో బాలురు 79.92 శాతం ఉత్తీర్ణత కాగా, పాలిసెట్‌లో బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.
- పాలిసెట్‌లో నామాల లోకేశ్(వరంగల్)- ఫస్ట్ ర్యాంక్
- పాలిసెట్‌లో బానోతు హేమనాథ్(సూర్యాపేట)- సెకండ్ ర్యాంక్
- పాలిసెట్‌లో బానోతు హేమనాథ్(సూర్యాపేట)- సెకండ్ ర్యాంక్ సాధించారు.
