Watch Video: సూట్‌కేస్‌తో ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. అనుమానం వచ్చి ఆపి చెక్ చేయగా..
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ మొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఇద్దరు థాయ్ జాతీయుల నుంచి సుమారు 47.805 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 48 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుబడింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్ నుంచి AI-2356 విమానంలో ఢిల్లీకి వచ్చిన ఇద్దరు థాయ్ ప్రయాణికులు గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అనుమానాస్పద కార్యకలాపాల ఆధారంగా కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. తనిఖీలో ఒక వ్యక్తి బ్యాగ్‌లో సుమారు 29 కిలోలు, మరొక వ్యక్తి లగేజీలో 19 కిలోలు హైడ్రోపోనిక్ గంజాయి లభ్యమైంది.
ఇద్దరి దగ్గర నుంచి మొత్తం 6 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లులో ఈ డ్రగ్స్ స్వాధీనం చెసుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌లోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఇద్దరూ ఒక ప్రముఖ అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌కు కోసం ఈ సరుకును భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడైంది. ఢిల్లీలో ఈ గంజాయిని ఎవరికి అందజేయాల్సి ఉంది, దీని వెనుక ఏ అంతర్జాతీయ సిండికేట్ ఉందనే అంశాలపై కస్టమ్స్ మరియు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్ని NDPS చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఏమిటి ఈ హైడ్రోపోనిక్ గంజాయి ?
హైడ్రోపోనిక్ గంజాయి అనేది సాధారణ గంజాయి.. కానీ దీనిని మీద పెంచరు. దీనిని ఆధునిక వ్యవసాయ పద్ధతితో పెంచుతారు. గంజాయి మొక్కలను నేలకు బదులుగా పోషకాలు కలిపిన నీటి ద్రావణంలో పెంచుతారు. గంజాయి మొక్కల వేర్లు నేరుగా పోషక నీటిని గ్రహిస్తాయి. లైటింగ్, ఉష్ణోగ్రత, తేమ వంటి అన్ని అంశాలను పూర్తి నియంత్రణలో ఉంచి ఇండోర్‌లో వీటిని పెంచుతారు. దీని వల్ల మొక్కలు ఆరోగ్యంగా, రసాలతో నిండి, అధిక మత్తు కలిగించే పదార్థం ఉత్పత్తి చేస్తాయి.
అధిక మత్తు శాతం కారణంగా డ్రగ్ మార్కెట్‌లో హైడ్రోపోనిక్ గంజాయికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సాధారణ గంజాయి కంటే దీనికి 2-3 రెట్లు ఎక్కువ ధర ఉంటుంది. దీనిరుచి, వాసన, ప్రభావం అన్నీ ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో గంజాయి అక్రమమైన మాదక ద్రవ్యం. NDPS చట్టం కింద దీన్ని పండించడం, స్మగ్లింగ్ చేయడం, కొనడం, విక్రయించడం కూడా నేరం.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
