ఆ హీరో సినిమాలో చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. నయనతార..

Rajitha Chanti

Pic credit - Instagram

23 May 2026

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ చేసింది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా రాణిస్తూ, వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. 

నయనతార తన కెరీర్ ప్రారంభంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మాట్లాడుతూ, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'గజిని' సినిమాపై కొన్ని కామెంట్స్ చేసింది.

డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో 2005లో వచ్చిన 'గజిని' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో కీలకపాత్ర పోషించింది నయన్. 

ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది 'గజిని' సినిమాలో నటించడమేనని నయనతార ఓపెన్‌గా చెప్పేసింది.

దర్శకుడు మొదట తనకు కథ చెప్పినప్పుడు ఆ పాత్ర చాలా నచ్చిందని, కానీ వెండితెరపై ఫైనల్ అవుట్‌పుట్ చూసేసరికి తన పాత్ర పూర్తిగా మారిపోయిందని అన్నారు. 

సినిమాలో తన నటనకు ప్రాధాన్యమున్న చాలా సీన్స్ కట్ చేశారని, కేవలం ఒక గ్లామర్ డాల్‌గా మాత్రమే తనను చూపించారని... దీంతో తాను తీవ్ర నిరాశకు గురైందట.