AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్ ఉంటాయా..? క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేసీఆర్.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని గత కొన్ని రోజులుగా వార్తుల వస్తున్న విషయం తెలిసిందే. నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ముఖ్యమంత్రి తాజాగా క్లారిటీ...

KCR: తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్ ఉంటాయా..? క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేసీఆర్.
Cm Kcr
Narender Vaitla
|

Updated on: Mar 10, 2023 | 5:00 PM

Share

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని గత కొన్ని రోజులుగా వార్తుల వస్తున్న విషయం తెలిసిందే. నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ముఖ్యమంత్రి తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శుక్రవారం జరిగిన బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఈ విషయంపై సీఎం స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని, ప్రజల్లోనే ఉండాలని పార్టీ నాయకులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ భవన్‌లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ పలు కీలక విషయాలను పంచుకున్నారు. నాయకులు పాద యాత్రలు చేసుకోవాలని నాయకులకు సీఎం సూచించారు. ఏప్రిల్‌ 27వ తేదీన నిర్వహించే ప్లీనరీ ఈసారి లేదని, బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని సీఎం తెలిపారు. వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.

మంత్రులు నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో  సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎం తెలిపారు. కవిత ఈడీ నోటీసులపై కూడా కేసీఆర్‌ స్పందించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇలాంటి ఇంకా చాలా చూస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు సమాచారం. ఇలాంటి వాటికి భయపడొద్దని, ప్రెస్‌మీట్‌లు పెట్టి కేంద్రపై రివర్స్‌ అటాక్‌ చేయాలని కేసీఆర్‌ పార్టీ నాయకులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా