Telangana: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ.. ఢిల్లీలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం..

ఒకవైపు అభ్యర్థుల ఖరారుపై బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఫోకస్‌ పెడితే.. మరోవైపు తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని మోదీ. మార్చి 4, 5 తేదీల్లో వరుసగా రెండ్రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 4న ఆదిలాబాద్‌, 5న సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని. అధికారిక కార్యక్రమాలతోపాటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు మోదీ. ఇదిలా ఉంటే ఈలోపే తమ అభ్యర్థిత్వాన్ని కన్ఫాం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు కొందరు కీలక నేతలు. ఈ విషయంపై చర్చించేందుకు బీజేపీ ఆశావహులు ఢిల్లీకి క్యూకడుతోన్నారు.

Telangana: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ.. ఢిల్లీలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం..
Telangana BJP
Follow us
Srikar T

|

Updated on: Feb 28, 2024 | 5:58 PM

ఒకవైపు అభ్యర్థుల ఖరారుపై బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఫోకస్‌ పెడితే.. మరోవైపు తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని మోదీ. మార్చి 4, 5 తేదీల్లో వరుసగా రెండ్రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 4న ఆదిలాబాద్‌, 5న సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని. అధికారిక కార్యక్రమాలతోపాటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు మోదీ. ఇదిలా ఉంటే ఈలోపే తమ అభ్యర్థిత్వాన్ని కన్ఫాం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు కొందరు కీలక నేతలు. ఈ విషయంపై చర్చించేందుకు బీజేపీ ఆశావహులు ఢిల్లీకి క్యూకడుతోన్నారు. మరీ ముఖ్యంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై కన్నేశారు పలువురు పెద్ద నేతలు. ఈ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న విద్యాసంస్థల అధిపతి మల్క కొమురయ్య రెండ్రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ బీజేపీ పెద్దలను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్‌ కోసం కొయ్యల ఎమాజీ శ్రమిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమాజీకి బెల్లంపల్లి టికెట్‌ ఇచ్చి చివరి నిమిషంలో మార్చింది బీజేపీ అధిష్టానం. ఇలా చివరి నిమిషంలో బీఫామ్‌ మరొకరికి ఇవ్వడంతో తాజాగా పెద్దపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎమాజీ. పెద్దపల్లిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేస్తోంది. బీఆర్‌ఎస్‌లోని ఓ విద్యావేత్త సహా మరో ఇద్దరు ముఖ్యనేతల కోసం సంప్రదింపులు జరుపుతోంది.

రేపు బీజేపీలో చేరనున్నారు నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు. ఈయనతోపాటు మరికొందరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే రేపు ఢిల్లీలో బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా దాదాపు100కి పైగా లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలోనే తెలంగాణ నుంచి ఆరేడుగురు అభ్యర్థుల పేర్లు ఉండేలా కసరత్తు చేస్తోంది. ఇందులో నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు గానూ మూడు సీట్లు ఖరారుచేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముగ్గురు సిట్టింగ్‌లతోపాటు మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ జాబితాలో తమ పేర్లు వచ్చేలా పావులు కదుపుతున్నారు కీలక నేతలు. మరి వీరి ఢిల్లీ ప్రయాణం, టికెట్ కోసం చేసిన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది రేపు తొలిజాబితాలో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..