Police Commissioner: త్వరలో ఆ ఇద్దరు కీలక కమిషనర్లకు స్థానచలనం.. అసలు కారణం ఇదే..!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరోసారి అధికారుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉన్నత అధికారుల బదిలీలు రెండు మూడు రోజుల్లో చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా పోలీసులతో పాటు అన్ని శాఖలలో స్థానికతను ఆధారంగా చేసుకుని బదిలీలు చేపట్టాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరోసారి అధికారుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉన్నత అధికారుల బదిలీలు రెండు మూడు రోజుల్లో చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా పోలీసులతో పాటు అన్ని శాఖలలో స్థానికతను ఆధారంగా చేసుకుని బదిలీలు చేపట్టాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ స్థానికత కిందిస్థాయి సిబ్బందికి కాకుండా కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే వర్తిస్తుందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దీంతో కీలక కమిషనర్లు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎలక్షన్ కమిషన్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఇప్పటికే బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు పోలీసు విభాగంలో ఎక్కువ సంఖ్యలో బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. బదిలీల విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన తాజా నిబంధన పలువురు కమిషనర్లను బదిలీ చేసే అవకాశం కనిపిస్తుంది. స్థానికతను ఆధారంగా చేసుకొని ఒక పార్లమెంట్ కు చెందిన అధికారులు అదే పార్లమెంట్ పరిధిలో ఉండరాదని ఎలక్షన్ కమిషన్ సూచించింది. అదే పార్లమెంట్ స్థానంలో పని చేస్తున్న అధికారులను గుర్తించి బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలతో పలువురు ఉన్నత స్థాయి అధికారులు అది కూడా ముఖ్యంగా పోలీసులతోపాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వారికి వర్తిస్తుందని ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది.
దీంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లకి ఈ నిబంధన వర్తించనుంది. ఎలక్షన్ కమిషన్ తాజా నిబంధనల ప్రకారం వీరిద్దరికి పార్లమెంట్ ఎన్నికల బదిలీలో స్థానాచలనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్థానికత హైదరాబాదే. మరోవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా అవినాష్ మహంతి ఉన్నారు. అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని 10 పోలింగ్ స్టేషన్‌లో హైదరాబాద్ పార్లమెంట్ కిందికి వస్తాయి. అయితే అవినాష్ మహంతి స్థానికత కూడా హైదరాబాద్ కావడంతో ఈ సమస్య తలెత్తుతుంది. దీంతో స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలన్న ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం హైదరాబాద్ కమిషనర్లు బదిలీ అయ్యే ఆస్కారం ఉంది. ఒకవైపు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తన సర్టిఫికెట్స్‌లో హైదరాబాద్ స్థానికత ఉండటంతో ఆయన బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్థానికత కూడా హైదరాబాద్ కావడం విశేషం. ఆయన కమిషనర్ గా పనిచేస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ లో హైదరాబాద్ పార్లమెంటరీ పరిధికి పది పోలింగ్ స్టేషన్లో సైబరాబాద్‌లో ఉన్నాయి. దీంతో ఆయనను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక భారీ ఎత్తున పోలీస్ శాఖలో బదిలీలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనల మేరకు రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 13 మంది ఐపీఎస్ లకి కొత్త పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎలక్షన్ కమిషన్ తాజా నిబంధనల ప్రకారం రానున్న రోజుల్లో మరి కొంతమంది సీనియర్ అధికారుల బదిలీలు జరగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…