Unique Farming: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..! లక్షలు ఆర్జిస్తున్న ఆదర్శ రైతు.. ఎక్కడంటే..?

వ్యవసాయం సంక్షోభ తీరాలకు చేరుకుంటున్న వెళ్లాలో రకరకాల ప్రత్యామ్నాయాల పరిష్కారాలు ముందుకొచ్చాయి. వీటిలో ఏది సరైన మార్గం అంటే ఇది అని ఎవరు గట్టిగా చెప్పలేకపోతున్న, అ అభ్యుదయ రైతు మాత్రం సమగ్ర వ్యవసాయమే ఇందుకు పరిష్కరమని గత పది సంవత్సరాలుగా ఆచరణలో నిరూపిస్తున్నాడు. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తూ, ప్రకృతి సిద్ధమైన పంటలు పండిస్తున్నాడో రైతు, తద్వారా తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Unique Farming: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..! లక్షలు ఆర్జిస్తున్న ఆదర్శ రైతు.. ఎక్కడంటే..?
Unique Farming
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Feb 28, 2024 | 12:14 PM

వ్యవసాయం సంక్షోభ తీరాలకు చేరుకుంటున్న వెళ్లాలో రకరకాల ప్రత్యామ్నాయాల పరిష్కారాలు ముందుకొచ్చాయి. వీటిలో ఏది సరైన మార్గం అంటే ఇది అని ఎవరు గట్టిగా చెప్పలేకపోతున్న, అ అభ్యుదయ రైతు మాత్రం సమగ్ర వ్యవసాయమే ఇందుకు పరిష్కరమని గత పది సంవత్సరాలుగా ఆచరణలో నిరూపిస్తున్నాడు. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తూ, ప్రకృతి సిద్ధమైన పంటలు పండిస్తున్నాడో రైతు, తద్వారా తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంత నగర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతిలో రసాయనరహిత సేద్యంలో అందవేసిన రైతుగా పేరుపొందాడు. పండించిన పంటను కూడా స్వయంగా మార్కెట్ చేస్తూ లాభాలు గడిస్తున్నారు. గ్రామంలో 10 కుటుంబాలకు పని కల్పిస్తూ సేంద్రియ పద్ధతిలో చెరుకు సాగు చేపట్టి తద్వారా బెల్లాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు వాటితో పాటు వరి, అపరాల పంటలలైన మొక్కజొన్న, పెసర, పలురకాల పండ్లు, కూరగాయలు కూడా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నాడు.

బయోగ్యాస్ తో విద్యుత్ కోతలను సైతం అధిగమించి పంటలకు ప్రాణం పోతున్నాడు. ఆయన ప్రత్యామ్నాయ విధానాలతో ఉత్తమ రైతుగా ఎంపికై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతిలో రైతులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో రసాయనిక ఎరువులు వాడకం తో అన్ని విధాల నష్టం అని మార్కెట్లో తినే పదార్థాలు ఏవైనా కెమికల్ తో ప్రజలు ఇబ్బందికరంగా భావించిన శ్రీనివాస రావు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు సేంద్రీయ పద్ధతిలో గత 10 సంవత్సరాలుగా తనకున్న 25 ఎకరాల్లో వ్యవసాయం చేపట్టాడు. ఇరవై ఐదు ఆవులు 30 గేదెలతో వచ్చే వ్యర్థాలను సేంద్రియ ఎరువులను తయారు చేసి సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.

చెరుకు, వరి ,నిమ్మ, జామ అపరాల పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. తాను సాగు చేసిన చెరుకును తన గ్రామానికి పక్కనే ఉన్న ఫ్యాక్టరీలకు అమ్మకుండా తను సొంతంగా మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక షెడ్డును ఏర్పాటు చేసి, సేంద్రీయ పద్ధతిలో బెల్లాన్ని తయారు చేపట్టాడు. రోజుకు టన్ను చేరుకుతో క్వింటాల్ బెల్లం తయారు చేస్తున్నాడు. విద్యుత్తు లేకపోయినా ఆయిల్ ఇంజన్ తో కర్షర్ ద్వారా చెరుకు నుంచి రసాన్ని తీసి బెల్లాన్ని తయారు చేస్తున్నాడు. చెరుకు రసాన్ని ఉడికించే ఎందుకు కట్టెల ను కొనుగోలు చేయకుండా చెరుకు రసాన్ని తీసిన తర్వాత మిగిలిన పిప్పిని ఫైర్,పశువుల మేతకోసం ఉపయోగిస్తున్నట్లు రైతు తెలిపారు.

తాను తయారుచేస్తున్న బెల్లానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఒక కేజీ బెల్లం రూ. 80 రూపాయలు చొప్పున అమ్ముతున్నట్లు రైతు తెలిపాడు. కొనుగోలు చేస్తున్న కస్టమర్లు కూడా బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి దుకాణదారులు బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నారని బెల్లం ఉత్పత్తి కి మంచి గిరాకీ ఉందన్నారు. పండించిన చెరుకు ఫ్యాక్టరీ కి అమ్మడం ద్వారా 3వేల 3వందలు మాత్రమే వస్తున్నాయని అదే స్వయంగా చెరుకు ని బెల్లం తయారుచేస్తే వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది. దీంతో ఒక టన్ను చెరుకు ద్వారా బెల్లం తయారీ చేసి విక్రయిస్తే అన్ని ఖర్చులు పోను 8వేలు అదనంగా లాభం వస్తుందని రైతు తెలిపాడు. చెరుకు వేసిన దగ్గర్నుంచి చెరుకు కటింగ్ చేసి బెల్లం తయారు చేసే వరకు  కూలీలకు ఆసరా కల్పిస్తున్నారు. పలువురికి రైతులకు సేంద్రియ పద్ధతి పై అవగాహన కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.

సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే పంటలకు తానే స్వయంగా సీతాఫలం, వేప ,జిల్లేడు అడ్డసరం, ఆవు మూత్రంతో తయారు చేసిన మందు పిచికారీ చేస్తూ పంటను సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సేంద్రీయ పద్ధతిలో ప్రత్యామ్నాయ విధానాలతో ఉత్తమ రైతుగా ఎన్నికైన శ్రీనివాసరావును వెంకయ్య నాయుడు, హరీష్ రావు చేతులమీదుగా సన్మానం చేసి ఉత్తమ రైతు అవార్డును అందజేశారు. రైతులు సేంద్రీయ పద్ధతిలో సాగు చేపట్టే విధంగా ఆలోచించాలని ఆదర్శ రైతు బొమ్మి శెట్టి శ్రీనివాసరావు కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!
ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!