Telangana: జాగ్రత్త..!! ఇదో మాయ వల.. ఎరక్కపోయి ఇరుక్కున్నాడు అంతే సంగతులు..!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరా చేసుకుని లేని ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్ళు. జిల్లా కలెక్టరేట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో అమాయక మహిళలకు టోకరా వేశాడు ఓ మోసగాడు. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. నెల రోజులుగా కలెక్టరేట్ లో లేని ఉద్యోగాల్లో శానిటేషన్ విధులు నిర్వర్తిస్తున్నా.. వీరిని అధికారులు మాత్రం గుర్తించలేకపోయారు.

సూర్యాపేటలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని మణికంఠ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో శంకర్ అనే వ్యక్తి కొంత కాలంగా కార్యాలయం ఏర్పాటు చేశాడు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో శానిటేషన్ విభాగంలో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయని మోసపూరిత ప్రకటనలు ఇచ్చాడు. కలెక్టరేట్ లో మణికంఠ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పేరిట జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదు చేసుకున్న కాగితం చూపించి నమ్మబలికాడు. తాను ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి బురిడీ కొట్టించాడు. వేతనం రూ.18 వేలు వస్తుందనడంతో చాలా మంది ఉద్యోగం వస్తుందన్న ఆశతో దశల వారీగా రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు చెల్లించారు.
మాయ మాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గరి నుండి రెండు లక్షల చొప్పున వసూలు చేశాడు నిందితుడు. మొదటగా నమ్మకం కలిగేందుకు ముగ్గురికి లేని ఉద్యోగాలు వచ్చాయని నకిలీ నియామక పత్రాలు అందించాడు. మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళండని చెప్పి పంపడంతో ఆ ముగ్గురు రోజు కలెక్టరేట్ కు వెళ్లి శానిటేషన్ విధులు నిర్వహిస్తున్నారు. వారికి మూడు నెలలుగా నిందితుడు 8 వేల రూపాయలు సొంతంగా జీతం చెల్లించాడు. మూడు నెలలుగా ముగ్గురు వ్యక్తులు కలెక్టరేట్ లో శానిటేషన్ విధులను నిర్వర్తిస్తున్న కలెక్టరేట్ అధికారులు మాత్రం వీరిని గుర్తించలేకపోయారు.
అయితే ఈ తంతును నిజమని నమ్మిన మరికొంతమంది మహిళా బాధితులు లక్షల్లో డబ్బులు కుమ్మరించి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం, నిర్వాహకుడు శంకర్ వాయిదా వేస్తుండటంతో బాధితులకు అనుమానం కలిగింది. బాధితులంతా మొదట సూర్యాపేట కలెక్టర్ వెంకట్రావు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్ కు వెళ్లగా.. అధికారి అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగిన మహిళలు ఏజెన్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు శంకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…