AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మద్యానికి బానిసైన కన్న కొడుకును హతమర్చిన తండ్రి

చేతికి అంది వచ్చిన కొడుకు అండగా ఉంటాడు అనుకున్నాడు ఆ తండ్రి...సమస్యలను తీర్చి తమ బాగోగులు చూసుకుంటూ.. వయసు పైబడుతున్న తమకు తోడుగా ఉంటాడు అనుకున్నాడు. కానీ మద్యానికి బానిస అయిన కొడుకు కుటుంబానికి బారం కావడమే కాదు ..తన వ్యసనాలకు అడ్డు పడుతున్న తల్లిదండ్రులనే కడతేర్చే స్థితికి వచ్చాడు.

Hyderabad: మద్యానికి బానిసైన కన్న కొడుకును హతమర్చిన తండ్రి
Death
Peddaprolu Jyothi
| Edited By: Balu Jajala|

Updated on: Feb 28, 2024 | 7:22 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 28: చేతికి అంది వచ్చిన కొడుకు అండగా ఉంటాడు అనుకున్నాడు ఆ తండ్రి…సమస్యలను తీర్చి తమ బాగోగులు చూసుకుంటూ.. వయసు పైబడుతున్న తమకు తోడుగా ఉంటాడు అనుకున్నాడు. కానీ మద్యానికి బానిస అయిన కొడుకు కుటుంబానికి బారం కావడమే కాదు ..తన వ్యసనాలకు అడ్డు పడుతున్న తల్లిదండ్రులనే కడతేర్చే స్థితికి వచ్చాడు. ప్రతి రోజూ తాగి ఇంటికి రావడం.. తల్లిదండ్రులను వేధించడం, తాగుడు కు డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు పీకి పందిరి వేయడమే కాకుండా మద్యం మత్తులో తల్లి దండ్రులను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు.

కొడుకు పరిస్థితిని అదుపు చేయాలని భావించిన తల్లి దండ్రులు చివరకు అతని చేతిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంతో..మనసు కష్టం చేసుకుని కొడుకు పై తిరగబడ్డాడు తండ్రి.. తండ్రి కొడుకు మధ్య జరిగిన జరిగిన గొడవలో ప్రాణాలు కోల్పోయాడు కొడుకు వినయ్ రోజు తప్ప తాకి వచ్చినటువంటి కొడుకును కన్నతండ్రి కడ తెరిచినటువంటి ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల క్రితం ప్రవల్లిక అనే యువతిని ప్రేమ వివాహంచేసుకున్నాడు. విరిద్దరికి 2 సంవత్సరాల పాప కూడా ఉంది.

మద్యానికి బానిస అయిన వినయ్ తరచూ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడడం వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు దీంతో తండ్రి శ్రీనివాస్ ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు పైగా తాగొచ్చిన వినయ్ కుటుంబ సభ్యులపై తల్లి బిడ్డ లను తిట్టడమే కాకుండా దానికి పాల్పడేవాడు ఇది చూసిన తండ్రి శ్రీనివాస్ కోపంతో అర్ధరాత్రి పారతో కొట్టి హత్య చేశాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హయత్నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..