Telangana: అర్ధరాత్రి ఏందిరయ్యా ఈ గోల.. నల్ల కవర్లు చూసి దెబ్బకు షాక్..! అసలు కథ ఇదే..

నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న కొంతమంది వ్యాపారుల దుకాణాలు, ఇళ్ల ముందు క్షుద్రపూజల సామాగ్రిని ఉంచడం సంచలనంగా రేపింది. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బైక్ లపై వచ్చి ఈ పూజా సామాగ్రిని దుకాణాల ముందు వదిలి వెళ్లారు.

Telangana: అర్ధరాత్రి ఏందిరయ్యా ఈ గోల.. నల్ల కవర్లు చూసి దెబ్బకు షాక్..! అసలు కథ ఇదే..
Nagarkurnool News
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 28, 2024 | 6:05 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న కొంతమంది వ్యాపారుల దుకాణాలు, ఇళ్ల ముందు క్షుద్రపూజల సామాగ్రిని ఉంచడం సంచలనంగా రేపింది. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బైక్ లపై వచ్చి ఈ పూజా సామాగ్రిని దుకాణాల ముందు వదిలి వెళ్లారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న పూల దుకాణంతో పాటు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ఫర్నిచర్ దుకాణం, ఆ పక్కనే ఉన్న మరికొన్ని దుకాణాల ముందు, ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఇంటిముందు ఈనెల 25 న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజల సామాగ్రిని వదిలివెళ్లారు. నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, దుస్తులు, కోడి కాళ్లు వంటి సామాగ్రితో కూడిన కవర్ దుకాణాల ముందు దర్శనిమీయడంతో యాజమానులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించిన ఒక్కో కవర్ ను షాపుల వద్ద వదిలేస్తూ వెళ్లారు.

క్షుద్రపూజల సామాగ్రిని వదిలింది లింగాల మండల కేంద్రానికి చెందిన ఇనాయత్, మోహిన్ తో పాటు మరికొంతమంది ఉన్నారని దుకాణాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. క్షుద్ర పూజలలో ప్రధాన పాత్ర పట్టణ కేంద్రానికి చెందిన 14 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఖాజా ఖాన్ ఉన్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఖాజా ఖాన్ హస్తంతోనే ఈ క్షుద్ర పూజలు జరిగాయని నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పలువురు వ్యాపారుల ఫిర్యాదుపై విచారణ చేపట్టగా లింగాలకు చెందిన ఇనాయత్, జిల్లా కేంద్రానికి చెందిన మోయిన్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ పూజలు చేసినట్లు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. BRS కౌన్సిలర్ ఖాజా ఖాన్ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టిందని డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు.

వీడియో చూడండి..

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవలే క్షుద్ర పూజలు, గుప్తనిధుల తవ్వకాల పేరుతో 11మందిని పొట్టన పెట్టుకున్న సత్యం యాదవ్ ఘటన మరువక ముందే తాజా క్షుద్ర పూజల ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!