Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kandrakota: కాండ్రకోటలో ఉన్నది దెయ్యమా..? అదృశ్య శక్తా..?

మంత్రాలకు చింతకాయలు రాలవని అందరికీ తెలుసు..! కానీ... ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మూఢనమ్మకాలు వెంటాడుతునే ఉన్నాయి. ఈ సైబర్‌ యుగంలో కూడా మూఢ నమ్మకాలతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కీడు, దుష్టశక్తులు, చేతబడి, బాణామతి, దెయ్యం పేరుతో చేసే వెలికి చేష్టలన్నీ భయపెట్టేందుకే తప్ప, వాటి వల్ల ఎవరికీ ఏ ప్రమాదం జరగదు. కానీ.. ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతునే ఉన్నాయి.

Kandrakota: కాండ్రకోటలో ఉన్నది దెయ్యమా..? అదృశ్య శక్తా..?
Devil Fear
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 12, 2024 | 12:39 PM

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 12:  చీకటి పడితే చాలు కాకినాడ జిల్లా పెద్దపురంలోని కాండ్రకోట గ్రామస్తులు వణికిపోతున్నారు..కొన్ని రోజులుగా కాండ్రకోటలో క్షుద్ర పూజలు జరుగుతుండడం చర్చనీయాంశమైంది.. కాండ్రకోట గ్రామంలో కొన్ని రోజుల క్రితం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో పూజలు చేశారంటూ ప్రచారం జరిగింది. తర్వాత గ్రామంలో ఓ ఇంటి దగ్గర మేకను చంపి తినేయ్యడంతో నిజంగానే ఆగంతకుడు తిరుగుతున్నాడనే ప్రచారం జోరందుకుంది.

దాంతో అమావాస్య రోజు గ్రామంలోని శివాలయంతో పాటు నూకాలమ్మ తల్లి ఆలయంలో చండి హోమం అస్తదిగ్బంధన యాగం నిర్వహించారు గ్రామ పెద్దలు..గ్రామంలో తిరుగుతున్న దుష్టశక్తిని సంహరించాలని కాండ్రకోటలో 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేశారు మహిళలు.

అమావాస్య రోజు గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9 బృందం… అర్థరాత్రి 12 గంటలకు కాండ్రకోట ఊరి పొలిమేరలో అడుగుపెట్టింది టీవీ9 టీమ్‌. వింత ఆకారంలో ఉన్న అదృశ్య శక్తి గ్రామంలో సంచరిస్తోందంటూ.. చెలరేగిన పుకార్లను పటాపంచల్‌ చేసేందుకు.. అమావాస్య రోజున అర్ధరాత్రి గ్రామంలో టీవీ9 బృందం తిరిగింది. ఓ ఇంటి తలుపు తట్టి ఇంట్లో వాళ్ళు లేచే లోపు బట్టలు లేకుండా నగ్నంగా పొడవైన జుట్టు, పెద్ద పెద్ద పాదాలతో నల్లటి రూపంలో చెట్టుపై నుండి దూకి వెళ్లిపోయాడని చెబుతున్నారు కొంతమంది మహిళలు. దీంతో గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా… కర్రలతో యువకులు కాపలా కాస్తూ టీవీ9కు కనిపించారు.

కొన్ని రోజుల క్రితం గ్రామానికి చివర్లో ఉన్న తోటల్లోంచి ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించిన వీడియో గ్రామంలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తులను చూసి భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. అరుపులు, కేకలు వింత శబ్దాలు విన్న గ్రామ పెద్దలు ఇలాంటివి ఎప్పుడూ వినలేదని టీవీ9 తో చెప్పారు. గ్రామస్తులతో కలిసి వీధి వీధికి టీవీ9 బృందం తిరిగింది. అక్కడి నుంచి టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్‌ను దిగువన వీడియోలో చూడండి.

మరోవైపు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భోపాలపట్నం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.. గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమతో పూజలు చేసి ఆనవాళ్లు ఉన్నాయి.. తెల్లవారుజామున ఆటో కిరాయి కోసం వెళ్లి రోడ్డుపై ఉన్న ముగ్గును చూసి భయపడ్డాడు ఆటో డ్రైవర్.. అయితే కాండ్రకోటలో క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామంలో పూజలు హోమాలు చేయడంతో మా గ్రామ వైపుగా అగంతకుడు వచ్చి ఉంటాడని భయభ్రాంతులకు గురవుతున్నారు గ్రామస్తులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రహదోష నివారణకు ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి వాస్తు నియమాలుతెలుసా
గ్రహదోష నివారణకు ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి వాస్తు నియమాలుతెలుసా
లెజెండరీ నటుడు మృతి.. ఎన్టీఆర్‌ మూవీపై ఎఫెక్ట్‌?
లెజెండరీ నటుడు మృతి.. ఎన్టీఆర్‌ మూవీపై ఎఫెక్ట్‌?
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్..ఆకట్టకుంటున్న సింపుల్ ఎనర్జీ ఈవీ
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్..ఆకట్టకుంటున్న సింపుల్ ఎనర్జీ ఈవీ
ప్రభాస్ ముద్దాడుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ప్రభాస్ ముద్దాడుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
సంతానం కోసం ఆ ప్రసిద్ధ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. వీడియో
సంతానం కోసం ఆ ప్రసిద్ధ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. వీడియో
విద్యార్ధులకు హోలీ ఆఫర్‌.. ఆ రోజు పరీక్ష రాయని వారికి మరోఛాన్స్!
విద్యార్ధులకు హోలీ ఆఫర్‌.. ఆ రోజు పరీక్ష రాయని వారికి మరోఛాన్స్!
మాజీ ప్రధాని మనవరాలు.. స్టార్ హీరో భార్య.. పాన్ ఇండియా రేంజ్..
మాజీ ప్రధాని మనవరాలు.. స్టార్ హీరో భార్య.. పాన్ ఇండియా రేంజ్..
చాదర్‌ఘాట్‌, ఖైరతాబాద్‌లలో.. పలువురు బంగ్లాదేశీయులను అరెస్ట్
చాదర్‌ఘాట్‌, ఖైరతాబాద్‌లలో.. పలువురు బంగ్లాదేశీయులను అరెస్ట్
బర్త్ డే పార్టీ అంటే భయపడిపోతారు..ఓటీటీలో ఈ తెలుగు సినిమా చూశారా?
బర్త్ డే పార్టీ అంటే భయపడిపోతారు..ఓటీటీలో ఈ తెలుగు సినిమా చూశారా?
హైదరాబాద్‌లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు..
హైదరాబాద్‌లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు..